ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో క్వాంట్ యాక్టివ్ ఫండ్, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్‌లు గత 5 సంవత్సరాలలో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ CAGRని అందించాయి. దాదాపు 3.5 సంవత్సరాలలో పెట్టుబడిదారుడి డబ్బును రెట్టింపు చేశాయి. గత 5 సంవత్సరాలలో, క్వాంట్ టాక్స్ ప్లాన్ గ్రోత్ ప్లాన్, క్వాంట్ యాక్టివ్ ఫండ్ 22 శాతం కంటే ఎక్కువ CAGRని నమోదు చేశాయి.
క్వాంట్ మిడ్ క్యాప్
క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ గ్రోత్ ప్లాన్ గత 5 సంవత్సరాలలో సుమారు 20 శాతం CAGR నమోదు చేసింది. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్‌లో ఐదు ఏళ్ల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతం 2.60 లక్షలకు పెరిగి ఉండేది. క్వాంట్ యాక్టివ్ ఫండ్, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ దాని పెట్టుబడిదారులకు 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడిని ఇచ్చిందని ప్రొఫిషియెంట్ ఈక్విటీస్ వ్యవస్థాపకుడు & డైరెక్టర్ మనోజ్ దాల్మియా అన్నారు.

క్వాంట్ యాక్టివ్ ఫండ్
క్వాంట్ యాక్టివ్ ఫండ్ జనవరి 1, 2013న ప్రారంభమైంది. క్వాంట్ యాక్టివ్ ఫండ్ డైరెక్ట్-గ్రోత్ నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) జూన్ 30, 2022 నాటికి రూ.2856.6 కోట్లుగా ఉన్నాయి. ఫండ్ ఎక్స్ పెన్స్ రేషియో 0.58%, ఇది అదే కేటగిరీలోని మెజారిటీ ఇతర ఫండ్‌ల కంటే తక్కువగా ఉంది. మునుపటి ఐదు సంవత్సరాలలో ఫండ్ వార్షిక SIP రాబడి 31.88 శాతంగా ఉంది.గత సంవత్సరంలో ఫండ్ రాబడి 12.65 శాతం నమోదు చేసింది.
Note: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నది. ఇందులో పెట్టుబడి పెట్టే ముందే నిపుణులను సంప్రదించడం మంచిది.


Click it and Unblock the Notifications