Quant Mutual Fund: గత నెలలో మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ దేశంలోని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ హౌస్ క్వాంట్ ఏఎంసీపై అనుమానాస్పద ఫ్రంట్ రన్నింగ్ విషయంలో దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ ఆఫీసుల్లో సెర్చ్ నిర్వహించగా దర్యాప్తు సైతం కొనసాగుతోంది. ఈ క్రమంలో కంపెనీ నిర్వహిస్తున్న వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ భయాందోళనతో అనేక మంది ఇన్వెస్టర్లు తమ డబ్బును వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్ సంస్థ వద్ద నగదు నిల్వలు రూ.5,861 కోట్లుగా ఉండగా.. అవి ప్రస్తుతం రూ.12,269 కోట్లకు పెరిగాయని తాజా ఆర్థిక గణాంకాలు వెల్లడించాయి. 1996లో స్థాపించబడిన క్వాంట్ మ్యూచువల్ ఫండ్ దేశంలోని అగ్రశ్రేణి మ్యూచువల్ ఫండ్ హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. అసెట్ మేనేజ్‌మెంట్ విభాగంలో 22 ఏళ్లకు పైగా ప్రయాణాన్ని కలిగి ఉంది. కంపెనీ తన నిర్వహణలో మొత్తం 21 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లతో, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ రూ.1,000 కోట్లకు పైగా నగదు స్థానాలను కలిగి ఉన్న మూడు పథకాలతో ప్రత్యేకంగా నిలుస్తుంది. జూలైలో కంపెనీ వీటికి రూ.3,223.24 కోట్ల గణనీయమైన నగదు మొత్తాన్ని కేటాయించింది.

ఫండ్ హౌస్ జూలై 2024 నాటికి రూ.96,626 కోట్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది. నెలవారీగా రూ.6,000 కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM) పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఈ క్రమంలో కంపెనీకి చెందిన టాప్ మ్యూచువల్ ఫండ్స్ గమనిస్తే.. మెుదటగా క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ రూ.7231.07 కోట్లను నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో రెండవది క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రూ.6,161.87 కోట్లను నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో క్వాంట్ ELSS టాక్స్ సేవర్ ఫండ్ గరిష్ఠంగా రూ.10,505.96 కోట్ల నిధులను నిర్వహిస్తోంది. ఇక చివరిగా క్వాంట్ లార్జ్ క్యాప్ ఫండ్ రూ.1,895 కోట్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది.
NACL ఇండస్ట్రీస్, రామ్‌కో సిమెంట్స్, కేర్ రేటింగ్స్, EIL, సెయిల్, జిందాల్ స్టీల్ & పవర్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐఆర్ఎఫ్‌సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్, సంవర్ధన మదర్సన్, ఇకియో లైటింగ్స్ వంటి దాదాపు 18 స్టాక్స్‌లో ఫండ్ హౌస్ తన పెట్టుబడులను జూలై నెల తర్వాత తగ్గించింది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications