IPO News: తొలిరోజే 100 శాతం లాభం.. ఐపీవో గ్రాండ్ ఎంట్రీ.. బంపర్ లిస్టింగ్ తర్వాత..

Qualitek Labs IPO: జనవరి చివరికి వచ్చిన వేళ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. ఒక పక్క పదుల సంఖ్యలో ఐపీవోలు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతుంటే.. లిస్టింగ్ అవుతున్న కంపెనీలు సూపర్ లాభాలను అందిస్తున్నాయి.

ఈ రోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన క్వాలిటెక్ ల్యాబ్స్ ఐపీవో స్టాక్ మార్కెట్‌లో బలమైన లాభాలతో వచ్చింది. బీఎస్ఈలో ఇష్యూ ధర కంటే 90 శాతం ప్రీమియం రేటుకు లిస్టింగ్ కావటం ఇన్వెస్టర్లకు కాసుల పంట కురిపించింది. వాస్తవానికి ఐపీవో ఇష్యూ గరిష్ఠ ధర రూ.100గా ఒక్కో షేరుకు కంపెనీ నిర్ణయించింది. దరఖాస్తుల ద్వారా షేర్లను పొందిన పెట్టుబడిదారులు ఒక్కో షేరుపై రూ.99.50ను లాభంగా మెుదటి రోజే అందుకున్నారు.

Qualitek Labs IPO doubled investors on first day with bumper listing, know details

అయితే మార్కెట్లో లిస్టయిన కొద్దిసేపటికే కంపెనీ షేర్లు 5 శాతం మేర లాభపడ్డాయి. ఆ తర్వాత కంపెనీ షేర్ల ధర బీఎస్‌ఈలో రూ.199.50 స్థాయికి చేరుకుంది. వాస్తవానికి ఐపీవో ఇష్యూ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం జనవరి 18న ప్రారంభించబడి జనవరి 23న ముగిసింది. ఈ క్రమంలో 3 రోజుల సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ సమయంలో IPO 65 కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.చివరి రోజున కంపెనీ గరిష్ఠంగా 58.95 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ పొందింది.

ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించింది. అంటే ఎవరైన రిటైల్ ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో రూ.1,20,000 పెట్టుబడిగా పెట్టినట్లయితే వారు తొలిరోజే రూ.1,20,000 లాభంగా అందుకున్నారు. కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.19.64 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించింది. ఐపీవో ఫ్లోట్ చేయటానికి ముందరు కంపెనీలో ప్రమోటర్ల వాటా 99.99 శాతంగా ఉండగా ప్రస్తుతం అది 73.35 శాతానికి తగ్గింది. కంపెనీ ప్రమోటర్లు అలోక్ కుమార్ అగర్వాల్, అంతర్యామి నాయక్, కమల్ గ్రోవర్, TIC సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+