Trending Stock: ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా పెట్టుబడిదారులు చిన్న, మధ్య తరహా షేర్లపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో తక్కువ ధర పలికే కొన్ని షేర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరిగిపోతోంది.
ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నది క్వాడ్రంట్ టెలివెంచర్స్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. గత శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకుల మధ్య కొన్ని పెన్నీ స్టాక్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం టెలికాం రంగంలోని క్వాడ్రంట్ టెలికాం లిమిటెడ్ పెన్నీ స్టాక్ ధర 10 శాతం ఎగువ సర్క్యూట్‌లో లాక్ అయ్యింది. గత శుక్రవారం స్టాక్ ధర రూ.1.95 వద్ద ముగిసింది. ఇది షేరు 52 వారాల గరిష్ఠ ధర. అలాగే గత ఏడాది జూలైలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.0.75 వద్ద నిలిచింది.

గడచిన నెల రోజుల్లో స్టాక్ 57 శాతానికి పైగా రాబడిని అందించింది. ఆరు నెలల వ్యవధిలో దాదాపు 100 శాతం రాబడిని ఇచ్చింది. డిసెంబర్ నాటికి కంపెనీలో ప్రమోటర్లకు 51.32 శాతం వాటా ఉండగా.. పబ్లిక్ వాటాదారులు 48.68 శాతం హోల్డ్ చేస్తున్నారు. ప్రమోటర్లలో క్వాడ్రంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, నిప్పాన్ ఇన్వెస్ట్‌మెంట్ & ఫైనాన్స్, టెక్‌కేర్ ఇండియా ప్రమోటర్‌గా కంపెనీలో వాటాను కలిగి ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దేశీయ ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా దిగ్గజం ఎల్ఐసీకి కంపెనీలో 10,76,2205 షేర్లు ఉన్నాయి. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ కంపెనీకి చెందిన 1,16,98,980 షేర్లను కలిగి ఉంది. క్వాడ్రంట్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 5.89%, నష్టం 0.06% తగ్గింది. ప్రస్తుతం కంపెనీ నికర నష్టం రూ.27.63 కోట్లుగా ఉంది. అమ్మకాలు 33.51% క్షీణించి రూ.64.94 కోట్లకు చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications