ఇరాన్ ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్ అయిన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలను లక్ష్యంగా చేసుకుని దాడి ప్రారంభించింది. మార్చి 19, 2026 గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన.. ఇప్పటికే ఉద్రిక్తతలలో ఉన్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణకు మరింత నాటకీయ మలుపు ఇచ్చింది. ఖతార్ ఎనర్జీ ప్రకటన ప్రకారం.. పెర్ల్ GTL సదుపాయానికి తీవ్ర నష్టం, ఇతర LNG సదుపాయాలకు చిన్న దాడులు జరిగాయని ధృవీకరించింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగ లేదు. అత్యవసర బృందాలు వెంటనే నియమించబడ్డాయి.
ఇరాన్ ఈ దాడిని ఇజ్రాయెల్ రాత్రిపూట సౌత్ పార్స్‌పై దాడికి ప్రతీకారంగా చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ, బసిజ్ పరామిలిటరీ నేత ఘోలమ్రెజా సోలేమానీ మరణించారని, ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ కూడా హతమయ్యారని ఇరాన్ ప్రకటించింది. ఈ ఘటనలు ఆర్థిక మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం వైపు మళ్లించాయి.

రాస్ లఫాన్ LNG ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్దది, ఇందులో సుమారు 1,800 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయు నిల్వలు ఉన్నాయి. ఇది దశాబ్దాలపాటు ప్రపంచ గ్యాస్ డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యం కలిగినది. సౌత్ పార్స్‌లోని గ్యాస్ ఉత్పత్తిలో ఇరాన్ 30 శాతం వరకు ఆధారపడినందున, ఈ దాడి గ్లోబల్ ఇంధన మార్కెట్లపై తక్షణ ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ దాడుల తరువాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ట్రంప్, సౌత్ పార్స్‌పై ఇజ్రాయెల్ దాడికి అమెరికాకు సంబంధం లేదని, ఖతార్ దీనిలో భాగం కానుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా, ఇజ్రాయెల్‌ను హామీ ఇచ్చేలా చెప్పినట్లు చెప్పారు.
అలాగే, ట్రంప్ ఇరాన్‌కు హెచ్చరిక జారీ చేశారు. ఖతార్ వంటి శాంతియుత దేశంపై దాడి చేస్తే, అమెరికా భారీ ప్రతిస్పందనతో వ్యవహరించనుందని స్పష్టంచేశారు. ఇలాంటి చర్యలు ప్రపంచ ఇంధన భద్రత, గ్లోబల్ సహజ వాయు సరఫరా, మరియు మధ్యప్రాచ్య స్థిరత్వానికి ముప్పు అని గుర్తు చేశారు.
రాస్ లఫాన్ LNG ప్లాంట్ మాత్రమే కాకుండా, ఇది ప్రపంచానికి రెండవ అతిపెద్ద సహజ వాయు ఎగుమతిదారుగా ఉంది. ఇక్కడ ఉద్రిక్తతలు కొనసాగితే.. సహజ వాయు సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. ఖతార్, సౌదీ అరేబియా, UAE వంటి ప్రాంతీయ మౌలిక సదుపాయాలను రక్షించడం అత్యంత అవసరం. ఈ సంఘటన ప్రపంచ ఇంధన ధరలను, LNG మార్కెట్ల భద్రతను, గ్లోబల్ ఎకానమీపై దాని ప్రభావాన్ని మళ్లీ గణనీయంగా ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications