Reliance Retail: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వేసిన ప్లాన్ ప్రకారమే ప్రస్తుతం గ్రూప్ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాను అనుకున్న 100 బిలియన్ డాలర్ల డ్రీమ్ మార్కును ఆయన అందుకున్నట్లు బ్రోకరేజీ సంస్థలు వెల్లడించాయి.
అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంటర్ లిమిటెడ్ లో 0.99 శాతం వాటాను రూ.8,278 కోట్లకు ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ డీల్ చేసుకుంది. దీంతో కంపెనీ వాల్యుయేషన్ రూ.8.28 లక్షల కోట్లు అంటే 100 బిలియన్ డాలర్ల మార్కును అందుకున్నట్లు వెల్లడైంది. ఈ కంపెనీలో 88.9 శాతం వాటాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిగి ఉంది.

దీనికి ముందు 2020లో రిలయన్స్ రిటైల్ వెంటర్ లిమిటెడ్ అనేక అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి రూ.4.21 లక్షల కోట్ల ప్రీ-మనీ ఈక్విటీ విలువతో రూ.47,625 కోట్లను సమీకరించింది. కేవలం మూడేళ్లలో కంపెనీ వాల్యుయేషన్ రెండింతలు పెరిగిందని ఇది సూచిస్తోంది. EBITDAకి ముందు కంపెనీ ఆదాయం FY23లో రూ.17,900 కోట్లగా ఉంటూ మూడేళ్ల కాలంలో రెండింతలైంది.
రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో మైనారిటీ ఇన్వెస్టర్లు కలిగి ఉన్న షేర్లను రద్దు చేసి, ఆపివేయనున్నట్లు సమ్మేళనం ప్రకటించిన ఒక నెల తర్వాత ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ డీల్ వచ్చింది. రిలయన్స్ రిటైల్‌తో పాటు, RRVL ఇతర అనుబంధ సంస్థలు, రిలయన్స్ బ్రాండ్స్, మార్క్స్ & స్పెన్సర్ వంటి జాయింట్ వెంచర్‌లను కూడా కలిగి ఉంది. ఇవి మిగిలిన దుస్తులు, ఇతర రిటైల్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. అనేక దీర్ఘకాలిక అంశాల కారణంగా భారతదేశంలోని ప్రజల ఖర్చు అలవాట్లు పెరుగుతాయని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications