కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తోన్న వైద్య సిబ్బందికి ఖతార్ ఎయిర్ వేస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ విమానాల్లో ఉచితంగా పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది. ఇందు కోసం లక్ష టికెట్లను కేటాయిస్తున్నామని.. అందుకు సదరు వైద్యులు/ సిబ్బంది దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దోహ కాలమానం ప్రకారం 12వ తేదీ 00.01 గంటల నుంచి మే 18వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు రిజిష్టర్ చేసుకోవాలని కోరింది.

ప్రోత్సహించేందుకు..
ప్రాణాలకు తెగించి మరీ సేవ చేస్తున్న వైద్యులకు సాయం చేయాలనే ఉద్దేశంతో టికెట్ల కేటాయింపు అంశం ముందుకు తీసుకొచ్చామని పేర్కొన్నది. ఖతార్ ఎయిర్ వేస్ వెబ్ సైట్ కెళ్లి.. వివరాలు నింపాల్సి ఉంటుంది. అయితే ఎవరూ ముందుగా తమ పేరును రిజిష్టర్ చేసుకుంటే.. వారికే టికెట్లు అందజేస్తామని తెలిపింది. ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన వైద్య సిబ్బంది ఆప్లై చేసుకోవాలని సూచించింది. కానీ ఆ దేశాలకు కేటాయించిన టికెట్ల ఆధారంగా కన్ఫామ్ చేస్తామని పేర్కొన్నది.

ఇలా అప్లై చేయండి..
వెబ్ సైట్ ఓపెన్ చేశాక.. ప్రమోషన్ కోడ్ అందిన వారు ఖతార్ ఎయిర్ వేస్ విమానాల్లో రెండు కాంప్లిమెంటరీ ఎకానమీ క్లాస్ రిటర్న్ టికెట్లను ఖతార్ ఎయిర్ వేస్ నడుపుతోన్న విమానాల్లో ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చని సూచించింది. వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషీయన్, క్లినికల్ రీసెర్చర్ ఆఫ్లై చేసుకునేందుకు అర్హులని తెలిపింది.

డిసెంబర్ 10 లోపు..
లక్ష మందిలో ఎంపికైన వారు ఈ ఏడాది నవంబర్ 26వ తేదీ లోపు టికెట్ బుక్ చేసుకోని.. డిసెంబర్ 10వ తేదీ లోపు ప్రయాణించాల్సి ఉంటుంది. విపత్కర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందజేస్తున్న ఆరోగ్య నిపుణులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నది. వైద్యులే నిజమైన హీరోలు అని.. దయ, అంకిత భావంతో పనిచేస్తున్నారని ఖతార్ ఎయిర్ వేస్ గ్రూప్ సీఈఓ అక్బర్ అల్ బేకర్ తెలిపారు.


Click it and Unblock the Notifications