IPO News: వచ్చే వారం మార్కెట్లోకి వస్తున్న ఐపీవో.. షేర్ ప్రైస్ బ్యాండ్ విడుదల..
IPO News: SBFC ఫైనాన్స్, కాంకర్డ్ బయోటెక్, TVS సప్లై చైన్ సొల్యూషన్స్ తర్వాత ఆగస్టులో నాలుగో ఐపీవో రెడీ అవుతోంది. తాజాగా కంపెనీ తన ఐపీవో షేర్ ధరను వెల్లడించింది.
వచ్చే వారం దేశీయ మార్కెట్లోకి సబ్‌స్క్రిప్షన్ కోసం పిరమిడ్ టెక్నోప్లాస్ట్ కంపెనీ ఐపీవో వచ్చేస్తోంది. ఆగస్టు 18న ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరవబడుతోంది. ఈ క్రమంలో కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.151-166గా ఉంటుందంటూ ప్రైస్ బ్యాండ్ ప్రకటించింది. ఈ ఇష్యూ ద్వారా రూ.153.05 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకొంది. ఐపీవోకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను గమనిస్తే..

* ఐపీవోలో కంపెనీ ఒక్కో షేరుకు రూ.151-166 ధరకు విక్రయించాలని నిర్ణయించింది
* ఈ IPO శుక్రవారం, ఆగస్ట్ 18, 2023న ఇన్వెస్టర్ల కోసం తెరవబడుతుంది. ఆగస్ట్ 22, 2023న ముగుస్తుంది. పిరమిడ్ టెక్నోప్లాస్టిక్స్ షేర్లు BSE, NSEలో జాబితా చేయబడుతుంది.
* పిరమిడ్ టెక్నోప్లాస్ట్ ఐపీవో లిస్టింగ్ ఆగస్టు 30, 2023న జరగనుందని తెలుస్తోంది.
* ఐపీవోలో కంపెనీ 9,220,000 షేర్లను విక్రయించనుంది. వీటి విలువ రూ.153.05 కోట్లుగా ఉంది.
* రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 90 ఈక్విటీ షేర్లను లాట్ కింద కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే గరిష్ఠంగా 1170 షేర్లు లేదా 13 లాట్లను కొనేందుకు అనుమతి ఉంది.
* రిటైల్ పెట్టుబడిదారులు ఒక లాట్ (90 షేర్లు) కొనుగోలు చేసేందుకు రూ.14,940 వెచ్చించి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే గరిష్ఠంగా 13 లాట్ల కోసం రూ.1,94,220 వెచ్చించాల్సి ఉంటుంది.
* ఆగస్టు 25 నాటికి IPO షేర్ల కేటాయింపు ప్రాతిపదిక ఖరారు చేయబడుతుంది. అర్హులైన ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి ఆగస్టు 29న షేర్లు జమకానున్నాయి.

* BigShare Services Pvt Ltd పిరమిడ్ టెక్నోప్లాస్ట్ ఐపీవోకు రిజిస్ట్రార్‌గా నియమించబడింది.
* బిజయ్‌కుమార్ అగర్వాల్, జైప్రకాష్ అగర్వాల్, పుష్పా దేవి అగర్వాల్, మధు అగర్వాల్, యష్ సింథటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెడెన్స్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ LLP కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications