Indian Economy: దేశ ఆర్థిక వ్యవస్థపై PwC కీలక సర్వే.. ఆ విషయంలో తెగ భయపడిపోతున్న కంపెనీల CEOలు
PwC Suvey on CEOs: పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల్లో భారతీయ CEOల హవా కొనసాగుతూ ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి తాజాగా వారిపై జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఎక్కువ శాతం మంది ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భారత్‌లోని మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (CEO) రాబోయే 12 నెలల్లో దేశ ఆర్థిక వృద్ధిపై ఆశాజనకంగా ఉన్నట్లు PwC సర్వే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4 వేల 702 మంది CEO లలో దేశంలోని 79 CEOలు అభిప్రాయాల ఆధారంగా నివేదిక తయారైంది. వారిలో 86 శాతం మంది ఆర్థిక వ్యవస్థ మెరుగుదలపై నమ్మకంతో ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం మంది పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు.

ఇందుకు విరుద్ధంగా గ్లోబల్ CEOలలో కేవలం 44 శాతం మంది మాత్రమే తమ భూభాగాల్లోని ఆర్థిక అవకాశాల గురించి ఒకే విధమైన ఆశావాదాన్ని పంచుకుంటున్నారు. 2023లో తొమ్మిదవ ర్యాంక్ సాధించిన ఇండియా.. గ్లోబల్ CEO లకు ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా ఐదవ స్థానానికి చేరుకుంది. దీంతో ప్రపంచ స్థాయిలో భారతదేశ సానుకూల ఆర్థిక దృక్పథం కనిపిస్తోంది.
దేశంలోని 62 శాతం మంది బిజినెస్ హెడ్స్ వచ్చే ఏడాది తమ కంపెనీల వృద్ధిపై చాలా నమ్మకంగా అంచనాలను వ్యక్తం చేశారు. అయితే గ్లోబల్ CEOలలో కేవలం 37 శాతం మంది మాత్రమే ఇలాంటి విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు సర్వే హైలైట్ చేస్తోంది. ద్రవ్యోల్బణం మరియు సైబర్ అటాక్‌లు రాబోయే 12 నెలల్లో తమ కంపెనీలకు ప్రాథమిక ముప్పుగా భారత CEOలు గుర్తించారు.
ఇండియన్ CEOలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని సగం మంది ప్రధాన ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఇటీవల నివేదించింది. కఠినమైన ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ చీలికలు మరియు జనరేటివ్ AI వేగవంతమైన అభివృద్ధి వంటి సవాళ్లు ఉన్నాయి. ఇందుకు అదనంగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డేటా ప్రకారం ఆహార ధరల పెరుగుదల కారణంగా డిసెంబరు 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్ట స్థాయి 5.69 శాతానికి చేరుకుంది.


Click it and Unblock the Notifications