Movies news: సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్న ఎంటర్‌టైన్ మెంట్ సినిమా. నిరంతరం పని పని అంటూ ప్రదక్షిణలు చేసే సగటు నగర వాసులకు కొంతమేర ఆటవిడుపు ప్రాంతాలు PVR INOX తరహా మల్టీప్లెక్స్ లే అనడంలో సందేహం లేదు. అయితే కరోనా, OTTలు పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపించడంతో వ్యాపారం పెద్దఎత్తున మందగించింది. ఈ సమయంలో PVR INOX ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ఇండియాలో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ గా కొనసాగుతున్న PVR INOX.. వచ్చే ఆరు నెలల్లో 50 సినిమా స్క్రీన్‌లను మూసివేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. మాల్స్ లో ఉన్న ఈ ఆస్తుల వల్ల నష్టపోతున్నట్లు తెలిపింది. ఎటువంటి పునరుద్ధరణ ఆశలు లేకపోవడంతో ముగింపు దశకు చేరుకున్నట్లు ఇన్వెస్టర్ అప్‌డేట్ ప్రెజెంటేషన్‌లో ప్రకటించింది.

గతంలో ప్రత్యర్థులుగా ఉన్న PVR మరియు INOX లీజర్ ఫిబ్రవరి 2023లో తమ విలీనాన్ని పూర్తిచేశాయి. తద్వారా దేశంలోని మొత్తం 9 వేల స్క్రీన్‌లలో 1,689తో అతిపెద్ద సినిమా మల్టీప్లెక్స్ చెయిన్‌గా అవతరించింది. ఇవన్నీ ఇండియాతో పాటు శ్రీలంకలోని 115 నగరాల్లోని 361 సినిమాల్లో విస్తరించి ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో PVR మరియు INOX 30 సినిమాల్లో 168 కొత్త స్క్రీన్‌లను ప్రారంభించాయి. FY24లో 150-175 స్క్రీన్‌లను కొత్తగా తెరవాలని చూస్తున్నట్లు Q4 ఫలితాల అనంతరం ప్రెస్ రిలీజ్‌లో తెలిపింది.
త్రైమాసికంలో బాక్స్ ఆఫీస్ లో గణనీయమైన అస్థిరత నెలకొన్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజిలీ వెల్లడించారు. హిందీ చిత్రాల పేలవ పనితీరు, తక్కువ సంఖ్యలో హాలీవుడ్ రిలీజ్‌ల వల్ల FY23 పరిశ్రమ దెబ్బతిన్నట్లు తెలిపారు. FY24లో ఇవి మెరుగవుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో 225 కోట్ల సినర్జీలు సాధించగలమని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications