PVR Inox: ప్రస్తుతం దేశంలో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. దీంతో చాలా మంది సినిమా ప్రేక్షకులు మూవీ థియేటర్లకు రావటం భారీగా తగ్గిపోయింది. సినిమాలు విడుదలైన మెుదటి వారం రోజులు మాత్రమే ఎక్కువగా హాల్స్ ఫుల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పీవీఆర్ ఐనాక్స్ వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది.
పీవీఆర్ ఐనాక్స్ సినిమా అభిమానులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త వ్యాపార ఆలోచనతో ముందుకొచ్చింది. అనేక మందికి సినిమా హాలుకు వెళ్లి మూవీ చూడాలని అనిపించినప్పటికీ ఎక్కువ ఖర్చుల కారణంగా తగ్గిస్తున్నారు. అయితే అభిమాన నటుడి సినిమాను ఎక్కువ సార్లు చూడాలనుకునేవారు లేదా ఎక్కువగా సినిమాలు చూసే వ్యక్తులకు ఐనాక్స్ ఒక జాక్ పాట్ ప్లాన్ సిద్ధం చేసింది.

భారతీయ సినిమా పరిశ్రమలో కార్పొరేట్‌గా ఆధిపత్య స్థానాన్ని కొనసాగిస్తూ కొత్త ప్రేక్షకులను థియేటర్‌లకు ఆకర్షించడానికి కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభిస్తోంది పీవీఆర్ ఐనాక్స్. దీనిలో భాగంగా రూ.699 ధరతో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ 'PVR INOX Passport' ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ ప్లాన్ కింద నెలలో సోమవారం నుంచి గురువారం మధ్యలో 10 సినిమాలను చూసేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. అయితే ఈ పాస్ IMAX, Gold, LUXE, Director's Cut వంటి ప్రీమియం సేవలను పొందేందుకు అనుమతించదు.
ఈ సేవలు అక్టోబర్ 16 నుంచి ప్రారంభం అవుతున్నాయని తెలుస్తోంది. అంటే మూవీ లవర్స్ కేవలం ఒక్కో సినిమాకు రూ.70 చెల్లించటం ద్వారా నెలలో 10 సినిమాలను ఆస్వాధించొచ్చని తెలుస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ ఇటీవల ఆహారం, పానీయాల ధరలను 40 శాతం మేర తగ్గించింది. ఇది సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రూ.99కే ఫుడ్ కాంబోలను అందిస్తోంది. అంటే అటు టిక్కెట్ ఖర్చులతో పాటు ఇటు స్నాక్స్ బిల్ కూడా భారీగా తగ్గిపోనుంది.
'PVR INOX పాస్‌పోర్ట్'ని కనీసం మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ వ్యవధితో కొనుగోలు చేయవచ్చు. దీన్ని యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే 'పాస్‌పోర్టు'ను ఉపయోగించి సినిమా చూడాలనుకునే వారు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications