Venkata Dutta Sai: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, తన చిరకాల టెక్కీ ప్రియుడు వెంకట దత్తా సాయిని నిన్న రాత్రి పెళ్లాడింది. రాజస్థాన్ రాష్ట్రంలోని రాఫెల్స్ ఉదయపూర్ రిసార్ట్‌లో వీరి పెళ్లి బంధుమిత్రుల మధ్య ఆడంబరంగా జరిగింది. ఈ వివాహంలో రాజస్థానీ ఆచారాలు తెలుగు సాంప్రదాయంతో పాటుగా కనిపించాయి.
డిసెంబర్ 22, 2024 రాత్రి 11.20 గంటలకు పెళ్లితో జంట ఒక్కటయ్యారు. దీనికి ముందు ఈ నెల ప్రారంభంలో ఈ జంట తమ నిశ్చితార్థాన్ని డిసెంబర్ 14న ప్రకటించారు. అప్పట్లో వారు ఉంగరాలు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు. అయితే అత్యంత తక్కువ సమయంలోనే పెళ్లిచేసుకుని కొత్త జీవిత ప్రయాణాన్ని వారు ప్రారంభించారు. పచ్చదనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో రాజుల నాటి సంప్రదాయాలు పెళ్లిలో కనిపించాయి.

అయితే ఇప్పుడు అందరి దృష్టి సింధు భర్త వెంకట దత్త సాయిపైనే ఉంది. సాయి టెక్నాలజీ, ఫైనాన్స్‌లో బలమైన నేపథ్యం ఉన్న డైనమిక్ ప్రొఫెషనల్. ఆయన డేటా మేనేజ్‌మెంట్, అనలిటిక్స్ సొల్యూషన్స్‌లో ప్రత్యేకత కలిగిన హైదరాబాద్‌కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయిలో పనిచేస్తున్నారు. ఈ జంట కలిసి తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించగా పెళ్లికి సంబంధించిన కొన్ని పొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఎవరు ఈ వెంకట దత్త సాయి?
వెంకట దత్త సాయి ప్రస్తుతం పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. లింక్డ్‌ఇన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, అతను ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ నుండి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్/లిబరల్ స్టడీస్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. అతను 2018లో పూణేలోని ఫ్లేమ్ యూనివర్శిటీ నుండి అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.
ప్రస్తుతం వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్ ప్రోగ్రామ్స్ అండ్ గ్లోబల్ పార్టనర్‌షిప్‌లకు లీడర్షిప్ వహిస్తున్నారు. దత్త సాయి ప్రయాణం JSWతో మొదలై అక్కడ సమ్మర్ ఇంటర్న్ పాటు ఇన్-హౌస్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. అక్కడ అతని ఎక్స్పీరియన్స్ గురించి లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్‌లో నా BBA "ఐపిఎల్ టీమ్‌ని మేనేజ్ చేయడంతో పోల్చితే కొత్తగా ఉంది" అని అయితే తన అనుభవాల నుండి చాలా నేర్చుకున్నట్లు ఒప్పుకున్నాడు.


Click it and Unblock the Notifications