కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మే నెలలో ఆటో సేల్స్ భారీగా క్షీణించాయి. టూ వీలర్ సహా వాహనాల సేల్స్ పడిపోయినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) తెలిపింది. డీలర్స్‌కు టూ-వీలర్ డిస్పాచ్ ఏప్రిల్ నెలలో 9,95,097 యూనిట్ల నుండి 65 శాతం పడిపోయి 3,52,717 యూనిట్లకు పరిమితమైంది. మొత్తం మోటార్ సైకిల్ సేల్స్ 6,67,841 యూనిట్ల నుండి 56 శాతం తగ్గి 2,95,257 యూనిట్లకు పరిమితమయ్యాయి. స్కూటర్ సేల్స్ ఏకంగా 3,00,462 నుండి 83 శాతం క్షీణించి 50,294 యూనిట్లకు పరిమితమయ్యాయి.

సేల్స్ డౌన్
త్రీ-వీలర్ సేల్స్ ఏప్రిల్ నెలలో 13,728 యూనిట్లు కాగా మే నెలలో 91 శాతం క్షీణించి 1,251 యూనిట్లకు పడిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మే నెలలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్ విధించడం, ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆటో సేల్స్ క్షీణించాయి. అదే సమయంలో పలు కంపెనీలు తమ పరిశ్రమ నుండి ఆక్సిజన్‌ను మెడికల్ వినియోగానికి ఉపయోగించాయి. సేల్స్ పడిపోవడానికి ఇది కూడా కారణం.

ప్యాసింజర్ వెహికిల్ సేల్స్
మే నెలలో 88,045 ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ మాత్రమే నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కాలంలో వాహనాల విక్రయాలు లేవు. కాబట్టి ఈ ఏడాది ఏప్రిల్ విక్రయాలతో సరిపోల్చినట్లు SIAM తెలిపింది. 2021 ఏప్రిల్ నెలలో 2,61,633 కార్లు సేల్ అయ్యాయి.
2019 మే నెలలో 2,26,975 వాహనాలు విక్రయించగా, గత నెలలో 88,045 వెహికల్స్ మాత్రమే విక్రయించారు. ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 66 శాతం క్షీణించాయి.

కంపెనీలు క్లోజ్
మారుతీ సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్, రెనాల్ట్, నిస్సాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎంజీ మోటార్స్, హోండా, యమహా, హీరో మోటో కార్ప్, రాయల్ ఎన్‌ఫీల్డ్ సహా వివిధ ఆటో మొబైల్ కంపెనీలు తమ ప్లాంట్స్‌ను మే నెలలో మూసివేశాయి. ఆక్సిజన్‌ను మెడికల్ వినియోగానికి మరల్చాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications