For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పూరీ జగన్నాథుడి రూ.397 కోట్ల నిధులు ఎస్బీఐకి మళ్లింపు

|

యస్ బ్యాంకులో పూరీ జగన్నాథస్వామికి చెందిన రూ.397 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి బదలీ చేసినట్లు యస్ బ్యాంకు గురువారం తెలిపింది. ఇందులో స్వామివారికి చెందిన రూ.389 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉండగా, ఈ మొత్తంపై వడ్డీ రూ.8.23 కోట్లుగా ఉంది. మరో రూ.156 కోట్ల రెండు FDలను నెలాఖరులోగా బదలాయిస్తామని తెలిపింది.

శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణన్‌ కుమార్‌కు ఈ మేరకు యస్ బ్యాంక్ లేఖ రాసింది. డిసెంబర్ 31, 2019 వరకు త్రైమాసిక వడ్డీని చెల్లించామని, మార్చి 19, 2020 వరకు వచ్చే వడ్డీని రూ.389 కోట్ల అసలుతో కలిపి ఎస్బీఐలోని జగన్నాథ టెంపుల్ కార్పస్ ఫండ్‌కు బదలీ చేసినట్లు తెలిపింది.

బంగారంపై పెట్టుబడి ఇప్పటికీ మంచిదేనా, ధర ఎందుకు తగ్గుతోంది?బంగారంపై పెట్టుబడి ఇప్పటికీ మంచిదేనా, ధర ఎందుకు తగ్గుతోంది?

Puri Jagannath Temple gets back Rs.397 crore from Yes Bank

మీ సూచన మేరకు రూ.397, 23,27,636 కోట్ల మొత్తాన్ని (రూ.389 ప్రిన్సిపల్ అమౌంట్, రూ. 8,23,27,636 వడ్డీ)ని బదలాయించినట్లు తెలిపారు. ఈ నెల మొదటి వారంలో యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్బీఐ, ఎస్బీఐ సహా వివిధ బ్యాంకులు ఇన్వెస్ట్ చేయడంతో యస్ బ్యాంకు గట్టెక్కి, 18వ తేదీ నుండి యథావిథిగా కార్యకలాపాలు ప్రారంభించింది.

English summary

పూరీ జగన్నాథుడి రూ.397 కోట్ల నిధులు ఎస్బీఐకి మళ్లింపు | Puri Jagannath Temple gets back Rs.397 crore from Yes Bank

The crisis hit Yes Bank on Thursday remitted more than ₹397 crore, including the interest, of the Shree Jagannath Temple Administration, Puri as instructed by the temple authorities.
Story first published: Friday, March 20, 2020, 13:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X