Pure EV IPO: ఇండియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విప్లవం మెుదలైంది. ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనం విభాగంలో అగ్రగామి బ్రాండ్ అయిన ప్యూర్ ఈవీ 2025లో భారీ ఐపీవోను తీసుకొచ్చేందుకు ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ అద్భుతమైన వృద్ధి ప్రగతిపథంలో కొనసాగుతోందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
నాట్కో ఫార్మా ఫ్యామిలీ ఆఫీస్, లారస్ ల్యాబ్స్ ఫ్యామిలీ ఆఫీస్, హెచ్ టీ వెంచర్స్, బీసీసీఎల్, యూఈపీఎల్, ఐ-టీఐసీ, ఐఐటీ హైదరాబాద్‌తో సహా ప్రముఖ పెట్టుబడిదారుల మద్దతుతో కంపెనీ బలమైన పెట్టుబడిదారుల పూర్తి నమ్మకాన్ని పొందింది. ప్యూర్ ఈవీ స్థిరంగా మంచి ఆర్థిక మూలాలను కలిగి వుంది. గత మూడేళ్లుగా నిర్వహణ లాభాలను సాధించింది. FAME సబ్సిడీలపై ఆధారపడకుండా నగదు చెల్లింపులను సజావుగా నిర్వహించింది. 85% వాటాను కలిగి ఉన్న కంపెనీ ప్రమోటర్లు, ఆపరేటింగ్ స్థాయిలో స్థిరంగా లాభాలను పొందుతున్నారు.

అంతర్గత బ్యాటరీ తయారీ, దాని పవర్‌ట్రెయిన్, సాఫ్ట్‌వేర్ బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్‌తో, ప్యూర్ ఈవీ 120 మేధోపరమైన లక్షణాలను పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. సరైన నగదు చెల్లింపులతో ఆర్గానిక్ విక్రయాలను నడుపుతోంది. ప్రభుత్వ రాయితీలు లేకుండానే కంపెనీ మూడేళ్ల నిర్వహణ లాభాలను సాధించింది. ఇటీవల కంపెనీ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లలో 100 ఎక్స్ వృద్ధికి సిద్ధంగా ఉన్న సెగ్మెంట్‌లో నం. 2 స్థానాన్ని దక్కించుకుంది. రాబోయే నాలుగేళ్లల్లో 20 ఎక్స్ టర్నోవర్ వృద్ధి అంచనాలతో, ప్యూర్ ఈవీ మాస్ కమ్యూట్ మార్కెట్లో వ్యూహాత్మకంగా స్థానం పొందింది. ఐఐటీ హైదరాబాద్‌తో ఇప్పటికే ఉన్న భాగస్వామ్యం, యూకే లోని కోవెంట్రీ నుంచి ఇంజినీరింగ్ సంస్థ పీడీఎస్ఎల్ తో FY26లో సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించి రాబోయే రోజుల్లో మరిన్ని అద్బుతమైన ఆవిష్కరణలు చేయబోతున్నామని పేర్కొన్నారు.
2025 భారత్ ఎలక్ట్రానిక్ విప్లవంలో భాగస్వామ్యం కావడం తమకెంతో ఆనందంగా ఉందని ప్యూర్ ఈవీ సీఈవో రోహిత్ వదేరా అన్నారు. నూతన ఆవిష్కరణలు, నైపుణ్యం, స్థిరత్వం పట్ల తమ నిబద్ధత ప్యూర్ ఈవీని అగ్రగామిగా నిలిపిందని తెలిపారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ రవాణా యొక్క భవిష్యత్తు, ప్యూర్ ఈవీనేనని తాము విశ్వసిస్తున్నామన్నారు. తమ వినూత్న AI ఆధారిత సాంకేతికత, పనితీరు, సామర్థ్యంపై దృష్టి సారించడంతో మోటార్‌సైకిల్ విభాగంలో గణనీయమైన వాటాను పొందేందుకు తమకు అనుమతి లభిస్తుందన్నారు. ప్రతిభావంతులైన బృందం, పెట్టుబడిదారుల మద్దతుతో, తాము కేవలం వాహనాలను విక్రయించడం లేదని, తాము తమ కమ్యూనిటీలకు ఈ సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ప్రస్తుతం ప్యూర్ ఈవీ.. EV విభాగంలో ప్రాంతీయ రవాణా కార్యాలయం స్థాయిలో సుమారు 7% మార్కెట్ వాటాను కలిగి ఉందన్నారు. భారతదేశం అంతటా టైర్ 1, టైర్ 2 నగరాల్లో దాని పరిధిని భారీగా విస్తరించాలనే ఆశయంతో ఉందని తెలిపారు. కంపెనీ ఇటీవల ప్రారంభించిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో వృద్ధి చెందుతున్న మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇది రాబోయే ఐదేళ్లలో 100 రెట్లు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు. భారతదేశంలో విక్రయించే ద్వి చక్ర వాహనాలలో 65% వాటా ప్యూర్ ఈవీ మోటార్‌సైకిళ్లదేనన్నారు.
సాంకేతికత అభివృద్ధి చెందడం, బ్యాటరీ ధరలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నందున, ప్యూర్ ఈవీ ఈ ట్రెండ్లను ప్రభావితం చేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందన్నారు. కంపెనీ యొక్క వినూత్న ఆఫర్లు, దూకుడు మార్కెటింగ్, బ్రాండింగ్ వ్యూహంతో కలిపి దాని డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల అమ్మకాలను వేగవంతం చేస్తామన్నారు. రాబోయే నాలుగేళ్లల్లో ప్యూర్ఈవీ రూ.2,000 కోట్ల టర్నోవర్‌ను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. టర్నోవర్ పెరగడం వల్ల లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. అయితే ఐపీవో పరిమాణంపై వివరాలను కంపెనీ ఇప్పటికి గోప్యంగానే ఉంచుతోంది. దీని గురించి తెలుసుకున్న ఇన్వెస్టర్లు ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో మాదిరిగా మంచి రాబడులను తెచ్చిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications