Punjab and Sind Bank: గత కొన్నేళ్లుగా దేశీయ బ్యాంకింగ్ రంగంలో పలు కీలక మార్పులు సంభవించాయి. బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణతో పాటు RBI పలు నిబంధనలను అప్‌డేట్ చేసింది. అయితే ఇప్పటికే ఒక రౌండ్ మెర్జర్ ప్రక్రియ పూర్తికాగా.. మరోసారి కొన్ని చిన్న బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. సదరు బ్యాంకులు వీటిని తిరస్కరించడం కూడా జరిగాయి.
ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ & సింధ్ బ్యాంక్ ను మరో రెండు ఇతర బ్యాంకులతో విలీనం చేస్తారని ఇటీవల వివిధ మీడియా సంస్థలను నివేదించాయి. అయితే ఈ వార్తలను సదరు బ్యాంకు కొట్టిపడేయడంతో పాటు తన పరిధిని మరింత విస్తరించనున్నట్లు తేల్చి చెప్పింది. ఈ వ్యూహంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 100 శాఖలను ప్రారంభించాలని యోచిస్తోంది. వీటికితోడు మరో 100 కొత్త ATMలను కూడా యాడ్ చేయాలని భావిస్తోంది.

'100 శాఖలను కొత్తగా నెలకొల్పనుండటంతో 2024-25 చివరి నాటికి మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 1,665కి చేరుకుంటుంది. అదేవిధంగా ATMల సంఖ్య 1,135కి పెరుగుతుందని' అని పంజాబ్ & సింద్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ స్వరూప్ కుమార్ సాహా తెలిపారు. ప్రస్తుతం శాఖల విస్తరణపై బ్యాంక్ దృష్టి సారిస్తుందని, నార్త్ ఇండియాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కొత్త బ్రాంచెస్ నెలకొల్పాలని చూస్తున్నట్లు చెప్పారు.
ఇవేకాకుండా బ్యాంకింగ్ కరస్పాండెంట్ (BC) ఛానల్స్ ద్వారా కూడా బ్యాంక్ పరిధిని విస్తరించాలని ప్రయత్నిస్తున్నట్లు స్వరూప్ వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో BC నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ముగిసేలోపు 1,700గా ఉన్న ఛానల్స్‌ను 4 వేలకి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications