Q3 Results: క్యూ3లో అదిరిపోయే లాభాలిచ్చిన ప్రభుత్వ బ్యాంక్.. స్టాక్ పరుగులే..
PNB Q3 Results: ప్రస్తుతం దేశీయ కార్పొరేట్ కంపెనీలు వరుసగా తమ క్యూ3 ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేడు ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
నేడు ఫలితాల విడుదల ఉన్నందున ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉండటంతో స్టాక్ ధర 2 శాతం మేర మధ్యాహ్నం ట్రేడింగ్ సమయంలో వృద్ధిని నమోదు చేసింది. రుణదాత క్యూ3లో కన్సాలిడేటెడ్ నికర లాభం 253% మేర పెరిగింది. నికర లాభం డిసెంబర్ 2022 త్రైమాసికంలో రూ.628.88 కోట్ల నుంచి డిసెంబర్ 2023 త్రైమాసికంలో రూ.2222.8 కోట్లకు పెరిగింది.

ఇదే క్రమంలో డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక కాలంలో ఏడాది ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం 12.13 శాతం పెరిగా రూ.10,293 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ 2023 త్రైమాసికంలో మొత్తం ఆదాయం 16% పెరిగి రూ.29,962 కోట్లకు చేరుకుంది. ఈ సమయంలో నిర్వహణ ఖర్చులు రూ.6,636 కోట్లకు తగ్గాయి. నిర్వహణ లాభం క్యూ3లో రూ. 5715.90 కోట్ల నుంచి 10.75% పెరిగి రూ.6330.71 కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.1.13 లక్షల కోట్లుగా ఉంది.
డిసెంబర్ 2022 త్రైమాసికంలో 2.44% నుంచి Q3లో నికర లాభ మార్జిన్లు 7.42 శాతానికి పెరిగాయి. డిసెంబర్ 2023 త్రైమాసికంలో స్థూల NPAలు రూ.60,371.38 కోట్లకు తగ్గాయి. ఇవి గత ఏడాది ఇదే కాలంలో రూ.83,583.87 కోట్లుగా ఉన్నాయి. నేడు మార్కెట్లు ముగిసే సమయంలో బ్యాంక్ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ.104.50గా ఉంది. గడచిన ఏడాది కాలాన్ని పరిశీలిస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్ ధర 95.06 శాతం మేర లాభపడింది.


Click it and Unblock the Notifications