PNB Q2 Results: రాకెట్ లాగా దూసుకెళ్లిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభాలు..!!
PNB Q2 Results: ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన రెండవ త్రైమాసిక ఫలితాలను నేడు విడుదల చేసింది. ఈ క్రమంలో కంపెనీ లాభాలు నాలుగింతలు పెరిగాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1,756 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది ప్రాతిపధికన ఇది 327 శాతం లాభాల వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.411.27 కోట్లుగా ఉంది. ఇది కంపెనీ వ్యాపారంలో బలమైన పనితీరును సూచిస్తోంది. ఇదే క్రమంలో నికర వడ్డీ ఆదాయం భారీగా 20 శాతం మేర పెరిగి రూ.9,923 కోట్లకు చేరుకున్నట్లు క్యూ2 ఫలితాల్లో వెల్లడించింది.

సెప్టెంబర్ త్రైమాసికంలో రుణదాత అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో రూ.87,034.79 కోట్ల నుంచి క్యూ2లో స్థూల ఎన్‌పీఏలు రూ.65,563.12 కోట్లకు తగ్గటం దీనికి కారణంగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 10.48 శాతంగా ఉన్న స్థూల NPA నిష్పత్తి క్యూ2లో 6.96%కి తగ్గింది. అలాగే బ్యాంక్ కేటాయింపులు క్వార్టర్లీ ప్రాతిపదికన రూ.3,965.26 కోట్ల నుంచి రూ.3,444.18 కోట్లకు తగ్గాయి.
సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో 0.91గా ఉన్న బ్యాంక్ డెట్ టు ఈక్విటీ నిష్పత్తి Q2లో రూ.0.76కి పడిపోయింది. ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో ఫ్లాట్ గా రూ.69.40 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.76,471 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications