కోరనా మహమ్మారి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 75 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఈ ప్రయోజనాలను బ్యాంకులు తమ కస్టమర్లకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా అదే బాట పట్టింది.
ఆర్బీఐ రెపో లింక్డ్ లెండింగ్ రేటును తగ్గించిందని, ఈ నేపథ్యంలో తాము వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది. అన్ని కాలపరిమితులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయని తెలిపింది.

బ్యాంకు తన బేస్ రేటును కూడా 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.05 శాతం నుండి 8.90 శాతానికి తగ్గించిందని తెలిపింది. బ్యాంకు వివిధ మెచ్యూరిటీ టర్మ్ డిపాజిట్ రేట్లను కూడా తగ్గించింది. ఏడాది అంతకుమించి కాలపరిమితి డిపాజిట్‌పై 5.80 శాతానికి తగ్గించింది.
ఆర్బీఐ తగ్గింపు నేపథ్యంలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించింది. అలాగే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వ్యక్తిగత, రిటైల్ రుణాలపై వడ్డీ రేటు 0.75 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఉండే యూబీఐ రుణాలపై వడ్డీ రేటు 7.95 శాతం నుంచి 7.20 శాతానికి తగ్గుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలపై వడ్డీ రేటు 8 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గుతుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications