Petrol Shock: పెట్రోల్, డీజిల్‌పై పన్ను రేట్లు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. వామ్మో..!!
Petrol Prices: అంతర్జాతీయ మార్కెట్లలోని చమురు ధరలకు.. దేశంలోని పెట్రోల్, డీజిల్ రేట్లకు అస్సలు పొంతన కుదరటం లేదు. దాదాపు ఏడాదికి పైగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 75 డాలర్లకు చేరువలో ఉన్నా ఇండియాలో రేట్లు మాత్రం చల్లబడటం లేదు.
చమురు కంపెనీలు నష్టాల నుంచి తేరుకున్నాయి.. త్వరలోనే రేట్లు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయని ప్రజల ఆశలపై పంజాబ్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. కొత్తగా కొలువైన అక్కడి ఆప్ సర్కార్ తాజాగా పెట్రోల్, డీజిల్ పై విధించే వ్యాట్ పన్నును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ వార్త విన్న పంజాబీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పుడున్నవే ఎక్కువ రేట్లని అనుకుంటుంటే.. కొత్త బాదుడు ఏంటా అని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్ ప్రభుత్వం ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను పెంచింది. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రిటైల్ వినియోగదారుల కోసం పెట్రోల్ ధరలను లీటరుకు 92 పైసలు, లీటరు డీజిల్ ధరలను 88 పైసలు మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు రూ.98.65కి చేరుకోగా.. లీటరు డీజిల్ ధర చండీగఢ్‌లో రూ.105.24గా ఉంది. జూన్ నుంచి లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26ల నుంచి పెరిగింది. ప్రస్తుత పెంపులతో పంజాబ్ ప్రభుత్వానికి ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం అదనంగా రానుంది.
పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎం భగవంత్ మాస్ ఇంధన ధరలను పెంచటం ఇది రెండోసారి కావటం గమనార్హం. దీనికి ముందు ఫిబ్రవరిలో పంజాబ్ రాష్ట్ర మంత్రివర్గం వార్షికంగా రూ.300 కోట్ల అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి పెట్రోల్, డీజిల్‌పై 90 పైసల వ్యాట్ విధించే నిర్ణయాన్ని గతంలో ఆమోదించింది.


Click it and Unblock the Notifications