Puneet Chhatwal: సంవత్సరానికి రూ. 25 కోట్ల జీతం తీసుకుంటున్న పునీత్ ఛత్వాల్..!

చాలా మందికి సంవత్సరానికి రూ.5 లక్షల జీతం రావడమే కష్టం. కానీ కొంత మంది సంవత్సరానికి రూ.12 లక్షలు, అంత కంటే ఎక్కువ జీతం పొందేవారు ఉన్నారు. అయితే సంవత్సరానికి కోట్లలో జీతం తీసుకునే వారు చాలా తక్కువ మందే ఉంటారు. టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పునీత్ ఛత్వాల్ వేతనం సంవత్సరానికి రూ.25 కోట్లుగా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో (FY26) ఆయన జీతం దాదాపు 9 శాతం పెరిగింది. కంపెనీ వెల్లడించిన వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం కంటే 2025లో ఛత్వాల్ వేతనం రూ.23 కోట్లుగా ఉంది. 2026 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆయన జీతం రూ.25 కోట్లకు పెరిగింది.

ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగుల మధ్యస్థ వేతనంతో పోలిస్తే, ఎండీ, సీఈఓ వేతనం నిష్పత్తి 2025 ఆర్థిక సంవత్సరంలో 506.1 రేట్లుగా ఉండగా అది 2026 ఆర్థిక సంవత్సరంలో 521.7రేట్లకు పెరిగింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల మధ్యస్థ వేతనంలో పెరుగుదల శాతం 5.5 శాతంగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 4.7 శాతంగా ఉంది. ఛత్వాల్ వేతన ప్యాకేజీలో పనితీరు ఆధారిత బోనస్‌తో కూడిన జీతం కింద రూ.14.21 కోట్లు, ప్రయోజనాలు, భత్యాల రూపంలో రూ.4.84 కోట్లు, అలాగే కమిషన్ కింద రూ.5.95 కోట్లు చెల్లిస్తున్నారు.

Puneeth Chatwal

లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం కేటాయించిన నిధులు ఈ గణాంకాలలో చేర్చలేదని కంపెనీ పేర్కొంది. వీటిని కలిపితే జీతం మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. జూన్ 30న జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా ఛత్వాల్ మూల వేతనాన్ని సవరించే ప్రతిపాదనకు ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ వాటాదారులు ఆమోదం తెలిపారు. కాగా ఛత్వాల్ ఈ కంపెనీలో ఆయన పదవీ కాలం 2027 నవంబర్ 5 వరకు ఉంది. తాజా సమావేశంలో ఆయన మూల వేతన పరిమితిని నెలకు గరిష్టంగా రూ.22 లక్షల నుండి రూ.30 లక్షలకు పెంచాలని నిర్ణయించారు.

పునీత్ ఛత్వాల్ లే కాకుండా చాలా మంది సీఈవోలు కోట్లలో జీతం పొందుతున్నారు. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సందీప్ కల్రా రూ.148.1 కోట్లు, హీరో మోటోకరప్ సీఈఓ పవన్ ముంజాల్ రూ.109.4 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ సీఈఓ రాజీవ్ జైన్ రూ.102.1 కోట్లు, హెచ్ సీఎల్ టెక్నాలజీ సీఈఓ సి. విజయకుమార్ రూ.94.6 కోట్లు, దవీస్ లాబోరేటరీస్ సీఈఓ మురళి కె. దివి రూ.88.2 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ.80.6 కోట్ల జీతం తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+