Infosys పూణే టెక్కీ పోస్ట్ వైరల్.. ఐటీ కంపెనీలో రాజీనామాకు 6 కారణాలివే..!

Infosys Pune Techie: టెక్ ఉద్యోగం ఒక రంగుల ప్రపంచం లాంటిది. బయటి నుంచి చూసేవారికి అది ఎంత అందంగా కనిపిస్తుందో.. అందులో ఉండే వాస్తవ పరిస్థితులు కేవలం పనిచేసేవారికి మాత్రమే తెలుస్తాయి. అయినప్పటికీ చాలా మంది భారతీయ యువత మాత్రం టెక్ ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు.

తాజాగా ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్న పూణేకి చెందిన టెక్కీ రాజీనామా పోస్టు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. వాస్తవానికి కుటుంబానికి ఏకైన ఆధాయవనరుగా ఉన్న సదరు టెక్కీ కొత్త ఉద్యోగం దొరకక ముందే ఉద్యోగాన్ని వదులుకోవటానికి గల కారణాలను వివరిస్తూ లింక్డిన్ పోస్టులో పంచుకున్నాడు. తాను కంపెనీలో పనిచేస్తున్న కాలంలో భూపేంద్ర విశ్వకర్మ ఎదుర్కొన్న సవాళ్లపై చివరికి ఓపెన్ అయ్యాడు. సహజంగా కార్పొరేట్ కంపెనీల్లో ఉండే దారుణమైన పరిస్థితుల గురించి 6 కీలకమైన అంశాలను అందులో పంచుకున్నాడు.

Pune techie resigned in Infosys post reasons behind going viral

1. ముందుగా ఇన్ఫోసిస్ కంపెనీలో ప్రమోషన్లు ఉంటాయి కానీ ఆర్థిక పరమైన వృద్ధి లేదని వాపోయాడు. తాను సిస్షమ్స్ ఇంజనీర్ నుంచి సీనియర్ సిస్షమ్స్ ఇంజనీరుగా ప్రమోట్ చేయబడినప్పటికీ ఎలాంటి హైక్ అందించలేదని పేర్కొన్నాడు. తాను పనిలో అంచనాలను అందుకున్నప్పటికీ చివరికి నిరాశే మిగిలిందని పేర్కొన్నాడు.

2. రాజీనామాల సమయంలో వర్క్ చేస్తున్న మిగిలిన టీం సభ్యుల సంఖ్య 50 నుంచి 30కి తగ్గినప్పుడు.. ఎక్కువ వర్క్ లోడ్ మిగిలినవారిపై పడేదని పేర్కొన్నాడు. ఇలాంటి సందర్భాల్లో కొత్త వారిని నియమించుకుని పనిభారం తగ్గేలా చేయటానికి బదులు కంపెనీ ఉన్న ఉద్యోగులపై భారం వేస్తూ వారికి ఎలాంటి అదనపు పరిహారం ఆఫర్ చేసేది కాదని వెల్లడించాడు.

3. కెరీర్ లో వృద్ధి లేదని పేర్కొంటూ.. తాను పనిచేస్తున్న ప్రాజెక్ట్ నష్టాల్లో ఉందని మేనేజర్ కూడా దానిని ఒప్పుకున్నట్లు పేర్కొన్నాడు. అలాంటి పనిలో కొనసాగటం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదని, వృత్తిపరంగా నిరాశకు గురిచేసేదని పేర్కొన్నారు.

4. అలాగే క్లయింట్ల కారణంగా పనివాతావరణం చాలా టాక్సిక్ గా మారేదని పేర్కొన్నాడు. తుఫాను వేగంతో సమాదానాలు వాస్తవానికి చాలా దూరంగా ఉందని పేర్కొన్నాడు. ఇది పనిలో ప్రతి స్థాయిలోనూ ఉద్యోగులపై భారీగా ఒత్తిడిని కలిగించేదని వెల్లడించాడు.

5. నా సహచరులు, సీనియర్ల నుండి స్థిరమైన ప్రయత్నాలు, గుర్తింపు ఉన్నప్పటికీ, అవేవీ స్పష్టమైన ప్రతిఫలాలుగా మారలేదని పేర్కొన్నాడు. అది ఆర్థిక వృద్ధి, ప్రమోషన్లు లేదా కెరీర్ పురోగతి కావచ్చు. కష్టపడి పనిచేయడం అనేది తేలికగా తీసుకోబడుతున్నట్లు ఇన్ఫోసిస్ కంపెనీలో అనిపించిందని పేర్కొన్నాడు.

6. ఇక ఆన్‌సైట్ అవకాశాలు ఎప్పుడూ మెరిట్ ఆధారంగా కాకుండా భాష ప్రాధాన్యతల ఆధారంగా ఉండేవని పేర్కొన్నాడు. ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళం మాట్లాడే ఉద్యోగులకు తరచుగా అలాంటి అవకాశాన్ని కంపెనీ అందించేదని వెల్లడించాడు. ఈ క్రమంలో తనలాగా హిందీ మాట్లాడే ఉద్యోగులను మాత్రం కంపెనీలో మంచి పనితీరు ఉన్నప్పటికీ దానిని పరిగణలోకి తీసుకోకుండా అవకాశాన్ని కల్పించేది కాదని వాపోయాడు.

ఇలాంటి సమస్యలు కంపెనీలో వేల మంది ఉద్యోగులకు ఉన్నాయని అయితే తాను తన ఆత్మగౌరవం, మానసిక ఆరోగ్యాన్ని వదులుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. కంపెనీలోని మేనేజర్లు ఇలాంటి పరిస్థితులను మార్చే ప్రయత్నం చేయకుండా కప్పిపుచ్చటాన్ని తప్పుపట్టాడు. ఇలాంటి పద్ధతులను అదుపు చేయకుండా వదిలేస్తే కంపెనీలు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కోల్పోవడమే కాకుండా తమ విశ్వసనీయతను కూడా కోల్పోతాయన్నాడు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+