Pulses Price Hike: దేశంలో అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో అనేక ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. కూరగాయల నుంచి పప్పు ధాన్యాల వరకు అన్ని రేట్లు పెరిగిపోయాయి. దీనికి తోడు ఇప్పటికే బియ్యం ధరలు ఆకాశాన్ని తాకటం ఆందోళన కలిగిస్తోంది.
వర్షాభావ పరిస్థితులు ఉత్పత్తిపై ప్రభావం చూపితే సరఫరాలో కొరత ఏర్పడుతుంది. దీంతో అన్ని రకాల రోజువారీ వినియోగ వస్తువుల ధరలు పెరగనున్నాయి. రవాణా ఖర్చుతో పాటు హోటల్ భోజనం కూడా పెరుగుతుంది. చివరికి ఇదంతా వినియోగదారుడి జేబులపై భారాన్ని మోపనుంది. రిటైల్ మార్కెట్‌లో పప్పులు ఒక ధర అయితే, జియో మార్ట్, డిమార్ట్, రిలయన్స్ మార్ట్, విశాల్ మార్ట్‌లలో ఈ ధర మళ్లీ మారడాన్ని చూడవచ్చు. మసాలా దినుసుల రేట్లు సైతం భారీగానే పెరుగుతున్నాయి.

జీలకర్ర, పసుపు, మిర్చి, మిరియాలు, ఇతర మసాలా దినుసుల ధరలు పెరుగుతున్నాయి. సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం జూలై నుంచి 22శాతం పైన ఉంది. ఇది డిసెంబర్, మార్చి మధ్య రిటైల్ ద్రవ్యోల్బణానికి మరో 0.6 శాతం పాయింట్లను జోడించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్పారు. ఎందుకంటే తదుపరి పంట వరకు ధరలు తగ్గే అవకాశం లేదు. అయితే అధిక ధరలు సాస్‌లు, ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులు, మసాలాలు, జామ్‌లు, మిఠాయిలు మొదలైన ఇతర ఆహార ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపుతాయి.
వర్షాలు కురవకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన కొద్దిపాటి పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు అవస్థలు పడుతున్నారు. వ్యవసాయోత్పత్తులు ఇప్పటికీ మార్కెట్‌కు సక్రమంగా సరఫరా కాకపోవడంతో కూరగాయలు, కిరాణా ఉత్పత్తులు, ఎండుమిర్చి, ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలు బతకలేని వాతావరణం ఏర్పడింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా వెల్లుల్లి దిగుబడి తగ్గి ఇటీవల కేజీ రేటు రూ.300 మార్కును దాటిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సబ్సిడీని పూర్తిగా నిలిపివేయటంతో మరోపక్క వంట గ్యాస్ సైతం భారంగా మారిపోయింది.
దేశంలోని మెట్రో నగరాల్లో ఇప్పటికే ప్రజలు ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితులు కొనసాగుతుంటే.. ఇప్పుడు తిండి కూడా కష్టతరమైంది. చాలా మంది యజమానులు కొత్త ఏడాది నుంచి అద్దెలు పెంచాలని మరోపక్క సిద్ధమౌతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పేద మధ్యతరగతి ప్రజలు జీవితాలు మరింత కష్టకాలాన్ని చూడనున్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications