Pulsar International Stock: దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీలో పాల్గొన్న అనేక పెన్నీ స్టాక్స్ ప్రస్తుతం మల్టీబ్యాగర్లుగా మారాయి. అప్పట్లో పైసల్లో ఉన్న కంపెనీ షేర్ల ధరలు నేడు రూపాయల్లోకి మారి వేలల్లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు లక్షల్లో లాభాలను అందుకుంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇన్వెస్టర్ల తలరాతను మార్చేసిన పెన్నీ స్టాక్ పల్సర్ ఇంటర్నేషనల్ గురించే. గడచిన ఐదేళ్ల కాలంలో స్టాక్ తన పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. 5 ఏళ్ల కిందట ఒక్కో షేరు ధర కేవలం 10 పైసలుగా ఉన్న పల్సర్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం రూ.13కి పెరిగాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులకు ఏకంగా 13220% అద్భుతమైన రాబడిని స్టాక్ అందించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.89.45 కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.14.40గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.6.08వద్ద ఉంది.

జూలై 2019లో పల్సర్ ఇంటర్నేషనల్ షేర్లు రూ.1 కంటే తక్కువగా ఉంది. జూలై 10, 2024న కంపెనీ షేర్లు రూ.13.32కి చేరుకున్నాయి. ఎవరైనా ఇన్వెస్టర్ ఐదేళ్ల కిందట కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే మార్కెట్ విలువ ప్రకారం పెట్టుబడి విలువ రూ.1.33 కోట్లకు చేరుకునేది. అలాగే మూడేళ్లలో పల్సర్ ఇంటర్నేషనల్ షేర్లు 8212% పెరిగాయి. జూలై 2021లో కంపెనీ షేర్లు 16 పైసల వద్ద ఉన్నాయి. పల్సర్ ఇంటర్నేషనల్ షేర్లు 10 జూలై 2024న రూ.13.32కి చేరుకున్నాయి. గత 6 నెలల్లో కంపెనీ షేర్లు 67% పైగా పెరిగాయి.
కంపెనీ పారిశ్రామిక& వినియోగ వస్తువులు కొనుగోలు విక్రయంలో ఉంది. కంపెనీ రసాయనాలు, పురుగుమందులు, పెట్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల్లో వ్యవహరిస్తుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ 1990లో స్థాపించబడింది. పల్సర్ ఇంటర్నేషనల్ మార్చి 2024 త్రైమాసికంలో రూ.76 లక్షల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అయితే గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.15.5 లక్షల నష్టాన్ని చవిచూసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications