Union Bank Q1 Results: ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు మంచి లాభాలను నమోదు చేస్తున్నాయి. చాలా బ్యాంకులను విలీనం చేయటం ద్వారా వాటి లాభాలు సైతం పెరిగాయి. ప్రైవేటు రంగంతో పోటీపడుతూ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందిస్తున్నాయి.
జూలై 20న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెుదటి త్రైమాసికంలో దాని స్టాండ్‌లోన్ నికర లాభం 107 శాతానికి పైగా పెరిగి రూ.3,236.44 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. గత ఏడాది కంపెనీ లాభం రూ.1,558.46 కోట్లుగా ఉంది. ప్రధానంగా ఆస్తి నాణ్యత పెరుగుదల, తక్కువ కేటాయింపులు, నికర వడ్డీ ఆదాయం పెరుగుదల సూపర్ లాభాలకు దారితీసినట్లు వెల్లడైంది.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంక్ వడ్డీయేతర ఆదాయం 38.57 శాతం పెరిగి రూ.3,903 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్ నివేదించింది. జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్లు 3.13 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు అనేది బ్యాంక్ సంపాదించిన వడ్డీ, దాని రుణదాతలకు చెల్లించే వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. స్థూల నాన్-పెర్ఫార్మింగ్ అసెట్(NPA) నిష్పత్తి 288 bps మెరుగుపడింది. నికర NPA సంవత్సరం క్రితం కాలంతో పోలిస్తే 173 bps తగ్గింది.
రిపోర్టింగ్ త్రైమాసికంలో బ్యాంక్ ప్రొవిజన్ కవరేజ్ నిష్పత్తి కూడా 611 bps పెరిగి 90.86 శాతానికి చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం కేటాయింపులు స్వల్పంగా 1.38 శాతం పెరిగి రూ.3,943 కోట్లకు చేరుకున్నాయి. అలాగే ఏప్రిల్-జూన్‌లో గ్లోబల్ అడ్వాన్స్‌లు రూ.8.19 లక్షల కోట్లు, దేశీయ అడ్వాన్సులు రూ.7.94 లక్షల కోట్లుగా ఉన్నట్లు బ్యాంక్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications