BSNL Subscribers: టెలికాం విప్లవంలో ప్రస్తుతం భారతదేశం పెద్ద మార్పులను చూస్తోంది. అంబానీ అష్టకష్టాలు పడి జియో సేవలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లినప్పటికీ సగటు భారతీయుడి మనసు మాత్రం ఘర్ వాపసీ అంటూ బీఎస్ఎన్ఎల్ పైనే పడింది. దీనంతటికీ కారణం అనంత్ అంబానీ లగ్జరీ మ్యారేజ్ ఈవెంట్ తర్వాత కంపెనీ టారిఫ్ రేట్లను పెంచటమే. ఇది మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్లకు దారితీసింది. దీని తర్వాత అదేదారిని ఎంచుకున్న ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియాలు సైతం ప్రస్తుతం ప్రతికూలతలు ఎదుర్కొంటున్నాయి.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీఎస్ఎన్ఎల్ కి మళ్లీ పూర్వ వైభవం తిరిగి వస్తోందని నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సెప్టెంబరు 2024లో దాదాపు 8.5 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను సంపాదించి ఆశ్చర్యకరమైన విజేతగా నిలవటమే నిపుణుల అభిప్రాయానికి కారణం. అయితే ట్రాయ్ డేటా ప్రకారం.. ప్రైవేట్ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఏకంగా కోటి మంది వినియోగదారులను కోల్పోవటం టెలికాం వ్యాపారంలో మారుతున్న ఆటకు అద్ధం పడుతోంది.

ఈ క్రమంలో రిలయన్స్ జియో అత్యధికంగా నెలలో 79.69 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోవటంతో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ బేస్ 46.37 కోట్లకు తగ్గింది. ఇదే క్రమంలో భారతి ఎయిర్‌టెల్ 14.34 లక్షల మంది యూజర్లను, వొడాఫోన్ ఐడియా 15.53 లక్షల మంది వినియోగదారులను కోల్పోయాయి. ఈ మార్పు తర్వాత ఎయిర్‌టెల్ వినియోగదారుల సంఖ్య 38.34 కోట్లకు తగ్గగా.. వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య 21.24 కోట్లకు పడిపోయింది. వాస్తవానికి కంపెనీలు తమ టారిఫ్ రేట్లు 10-27 శాతం మధ్య పెంపులను ప్రకటించటంతో చాలా మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ వంటి ప్రత్యామ్నాయాలకు మారటంతో పాటు రెండు సిమ్ములు వాడుతున్న వ్యక్తులు సైతం క్రమంగా ఒక సిమ్ కార్డ్ ఉపయోగించేందుకు మెుగ్గు చూపటం టెలికాం పరిశ్రమలో క్రమంగా మార్పులకు దారితీస్తోంది.
నిండు చందురుడు ఒకవైపు చక్కులు ఒకవైపు అన్నట్లుగా బీఎస్ఎన్ఎల్ కొత్తగా పెరుగుతున్న వినియోగదారులతో ప్రస్తుతం యూజర్ల సంఖ్యను 9.18 కోట్లకు పెంచుకోగలిగింది. అలాగే సమీప భవిష్యత్తులో టారిఫ్స్ పెంపు ఉండబోదని ఎండీ రాబర్ట్ రవి హామీ ఇవ్వటంతో చాలా మంది యూజర్లు ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ సరసమైన ధరలకు ఆకర్షితులుగా మారుతున్నారు. BSNL కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించడానికి, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ SIM కియోస్క్‌లు, డైరెక్ట్-టు-డివైస్ సేవల వంటి కార్యక్రమాలను కూడా అందుబాటులోకి తెచ్చింది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవలి కాలాల్లో టెలికాం యూజర్ల క్షీణత అధికంగా కొనసాగుతోంది.
ఇకపోతే బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో రిలయన్స్ జియో 47.7 కోట్ల మంది చందాదారులతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా.. రెండవ స్థానంలో ఉన్న భారతీ ఎయిర్‌టెల్ 28.5 కోట్లు, వొడాఫోన్ ఐడియా 12.6 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 3.7 కోట్ల మంది కస్టమర్లను కలిగి ఉన్నాయి. ఆగస్టులో దేశంలో మెుత్తం యూజర్ల సంఖ్య అర శాతానికి పైగా క్షీణతను చూస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications