Money Multiplier: లక్షను రూ.3 కోట్లు చేసిన ప్రభుత్వ స్టాక్.. 5 సార్లు బోనస్ షేర్లు ప్రకటన..

GAIL India Stock: కొన్నాళ్ల కిందట ప్రభుత్వ రంగం షేర్లు నష్టాలను నమోదు చేసేవని తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొన్నేళ్లుగా కంపెనీల పనితీరు మెరుగుపడటంతో పెట్టుబడిదారుల తలరాత పూర్తిగా మారిపోయింది. లక్షలు పెట్టిన వారికి కొన్ని ప్రభుత్వ షేర్లు కోట్లను రాబడులుగా అందించాయి.

మహారత్న కంపెనీ గెయిల్ ఇండియా షేర్లలో పెట్టుబడిపెట్టి ఓపికగా ఉన్న ఇన్వెస్టర్లకు భారీ రాబడులను అందుకున్నారు. గెయిల్ ఇండియా షేర్లు కేవలం కొన్ని సంవత్సరాల్లో ప్రజలను ధనవంతులను చేశాయి. కొన్నేళ్ల కిందట లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని మార్కెట్ విలువ రూ.3 కోట్లకు పైకి చేరుకుని ఉండేది. వాస్తావానికి పెట్టుబడిదారులకు కంపెనీ అందించిన బోనస్ షేర్లు ఈ కాలంలో అద్భుతాన్ని సృష్టించాయి. మే 18న మార్కెట్ల ముగింపు సమయంలో కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.208.75 వద్ద ట్రేడింగ్ ముగించాయి.

Public sector Stock GAIL turned 1 lakh investment into crore in longterm with bonus shares

GAIL ఇండియా గత కొన్ని సంవత్సరాల్లో 5 సార్లు బోనస్ షేర్లు ఇచ్చింది. అక్టోబర్ 2008లో 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చింది. అలాగే మార్చి 2017, మార్చి 2018లో 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించింది. కంపెనీ జూలై 2019లో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చింది. కంపెనీ ప్రతి షేరుకు 1 బోనస్ షేర్ ఇచ్చింది. గెయిల్ ఇండియా మునుపటి బోనస్ షేర్లను 1:2 నిష్పత్తిలో ఇచ్చింది. అంటే కంపెనీ ప్రతి 2 షేర్లకు 1 బోనస్ షేర్లను అందించింది.

19 మే 2000న గెయిల్ ఇండియా షేర్ ధర ఒక్కోటి రూ.5.51 వద్ద ఉంది. అప్పట్లో గెయిల్ ఇండియా షేర్లలో ఒక వ్యక్తి రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఆ కంపెనీకి చెందిన 18,148 షేర్లను పొందేవారు. గత కొన్నేళ్లలో కంపెనీ 5 సార్లు ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు ఇచ్చింది. గెయిల్ ఇండియా ఇచ్చిన బోనస్ షేర్లను కలిపితే రూ.లక్షకు కొనుగోలు చేసిన మొత్తం 18,148 షేర్ల సంఖ్య 1,45,182కు చేరింది. చివరిగా ట్రేడింగ్ ముగింపు సమయం అంటే మే 18న బీఎస్ఈలో ఒక్కో షేర్ ధర రూ.208.75 ప్రకారం మెుత్తం 1,45,182 షేర్ల విలువ రూ.3.03 కోట్లుగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+