Q1 Results: ప్రస్తుతం దేశీయ కార్పొరేట్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను ఒకదాని తర్వాత మరొకటి విడుదల చేస్తున్నాయి. బడ్జెట్ తర్వాత మార్కెట్లలో నష్టాల తుఫాను కొనసాగుతున్న వేళ కెనరా బ్యాంక్ తన ఫలితాలను ప్రకటించింది.
నేడు కెనరా బ్యాంక్ క్యూ1 ఫలితాల్లో నికర లాభం ఏడాది ప్రాతిపధికన 10.5 శాతం పెరిగి రూ.3,905.28 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 4 శాతం వృద్ధి చెందింది. ఇదే క్రమంలో కంపెనీ అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. ఈ క్రమంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 4.14 శాతంగా ఉంది. అయితే గత ఏడాది ఇదే కాలంలో నిరర్థక ఆస్తులు 5.15 శాతంగా ఉన్నట్లు బ్యాంక్ నివేదించింది. అలాగే నికర NPA నిష్పత్తి మార్చి త్రైమాసికంలో 1.27 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గింది. జూన్ 30 నాటికి స్థూల నిరర్థక ఆస్తులు రూ.40,356.38 కోట్లుగా ఉన్నాయి.

రిపోర్టింగ్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం దేశీయ డిపాజిట్ వార్షిక ప్రాతిపదికన 11.47 శాతం పెరిగి రూ.12.31 లక్షల కోట్లకు చేరుకుంది. అలాగే బ్యాంక్ టర్మ్ డిపాజిట్లు ఏడాదికి 14.82 శాతం పెరిగి రూ.8.50 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో రిటైల్ టర్మ్ డిపాజిట్ రూ.5.15 లక్షల కోట్లుగా ఉన్నట్లు బ్యాంక్ నివేదించింది. బ్యాంక్ దేశీయ స్థూల అడ్వాన్సులు ఏడాదికి 9.17 శాతం పెరిగి రూ.9.21 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వ్యవసాయం, అనుబంధ అడ్వాన్సులు 8.14 శాతం పెరిగి రూ.2.53 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఈ క్రమంలో మార్కెట్లు ముగిసే సమయానికి కెనరా బ్యాంక్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.112 వద్ద ప్రయాణాన్ని ముగించింది. నేడు కంపెనీ ఫలితాలను ప్రకటిస్తే ప్రొవిజన్స్ తగ్గటంతో పాటు మార్కెట్ అంచనాలను సైతం అందుకుంది. ప్రస్తుతం బడ్జెట్ తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నప్పటికీ కంపెనీ పనితీరు ఉత్తమంగా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications