చిన్న పొదుపు.. పెద్ద నిధి! PPF అకౌంట్‌లో నెలకు రూ. 2 వేల తో రూ. 1.08 కోట్లు సంపాదించండిలా!
భారతదేశంలో స్థిరమైన, సురక్షితమైన , దీర్ఘకాలిక పెట్టుబడుల విషయానికి వస్తే అందరికీ మొదట గుర్తొచ్చేది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). కేంద్ర ప్రభుత్వం 1968 లో ప్రారంభించిన ఈ పథకం, ఎటువంటి రిస్క్ లేని గ్యారెంటీ రిటర్న్స్ ఇచ్చే అద్భుతమైన ప్రభుత్వ మద్దతు గల పొదుపు పథకం. ప్రస్తుతం ఈ త్రైమాసికానికి పీపీఎఫ్‌పై 7.1 శాతం స్థిర వడ్డీ రేటు లభిస్తోంది. పన్ను ఆదా చేసుకోవాలన్నా, రిటైర్మెంట్ నాటికి భారీ మొత్తాన్ని కూడబెట్టాలన్నా ఇది బెస్ట్ ఆప్షన్.
పాత పన్ను విధానం (Old Tax Regime) కింద ఈ స్కీమ్‌కు 'EEE' (ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్) ప్రయోజనం ఉంది. అంటే మీరు పెట్టే పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం.. దేనిపైనా పన్ను కట్టాల్సిన పనిలేదు. సెక్షన్ 80C కింద ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ పొందవచ్చు.

నెలకు రూ. 2,000 డిపాజిట్ చేస్తే.. రిటైర్మెంట్ నాటికి ఎంతంటే..
మీరు ఏ వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసు నాటికి ఎంత ఫండ్ క్రియేట్ అవుతుందో ఈ క్రేజీ లెక్కల ద్వారా చూద్దాం..
- 20 ఏళ్ల వయసులో మొదలుపెడితే: 40 సంవత్సరాల పాటు నెలకు రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 9.60 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. దీనిపై వడ్డీయే రూ. 43.05 లక్షలు వస్తుంది. మొత్తంగా రూ. 52.65 లక్షలు చేతికి అందుతాయి.
- 25 ఏళ్ల వయసులో మొదలుపెడితే: 35 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే, మీ ఇన్వెస్ట్‌మెంట్ రూ. 8.40 లక్షలు అవుతుంది. వడ్డీ రూ. 27.91 లక్షలతో కలిపి మొత్తం రూ. 36.31 లక్షలు లభిస్తాయి.
- 30 ఏళ్ల వయసులో మొదలుపెడితే: 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే, మీ పెట్టుబడి రూ. 7.20 లక్షలు కాగా, వడ్డీ రూ. 17.52 లక్షలతో కలిపి మొత్తం రూ. 24.72 lakhs వస్తాయి.
పిల్లల పేరిట అకౌంట్ ఓపెన్ చేస్తే.. ఏకంగా రూ. 1.08 కోట్ల మార్క్!
మీ పిల్లల భవిష్యత్తు కోసం మైనర్ అకౌంట్‌గా కూడా దీనిని ఓపెన్ చేయవచ్చు. పిల్లవాడికి 18 ఏళ్లు నిండాక అది రెగ్యులర్ అకౌంట్‌గా మారుతుంది. ఉదాహరణకు.. మీ బాబు లేదా పాప పేరిట 10 ఏళ్ల వయసు నుండి 50 సంవత్సరాల పాటు నెలకు రూ. 2,000 చొప్పున డిపాజిట్ చేస్తే, మీ మొత్తం పెట్టుబడి రూ. 12 లక్షలు అవుతుంది. కాంపౌండింగ్ పవర్ వల్ల దీనిపై వచ్చే వడ్డీ ఏకంగా రూ. 96.12 లక్షలు! అంటే 60 ఏళ్ల వయసు వచ్చేసరికి చేతికి వచ్చే మొత్తం మెచ్యూరిటీ వాల్యూ అక్షరాలా రూ. 1.08 కోట్లు!
ప్రతి నెలా 5వ తేదీ లోపే ఎందుకు డిపాజిట్ చేయాలి?
పీపీఎఫ్‌లో గరిష్ట లాభాలు పొందాలంటే ఒక ముఖ్యమైన రూల్ తెలుసుకోవాలి. PPF లో వడ్డీని ప్రతి నెలా 5వ తేదీ నుండి నెల చివరి వరకు ఉండే కనీస బ్యాలెన్స్‌పై లెక్కిస్తారు. కానీ ఈ వడ్డీని ప్రతి సంవత్సరం మార్చి 31న అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారు. కాబట్టి మీరు ఏ నెలలోనైనా 5వ తేదీ దాటిన తర్వాత డిపాజిట్ చేస్తే, ఆ నెలకు మీకు వడ్డీ రాదు, అది తర్వాతి నెల నుండి లెక్కించబడుతుంది. కాబట్టి 5వ తేదీ లోపు డిపాజిట్ చేయడం మంచిది.
అకౌంట్ ఎక్స్‌టెన్షన్ ఎలా చేసుకోవాలి?
పీపీఎఫ్ అకౌంట్ ప్రాథమిక లాక్-ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు. ఈ కాలపరిమితి ముగిసిన తర్వాత, మీరు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుని అకౌంట్ క్లోజ్ చేయవచ్చు. లేదా ఐదేళ్ల బ్లాక్ చొప్పున (Blocks of 5 years) ఎన్ని సార్లయినా, జీవితాంతం పొడిగించుకోవచ్చు (Extension). ఈ పొడిగింపు ఆటోమేటిక్‌గా అవ్వదు, మెచ్యూరిటీ సమయానికి బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి రిక్వెస్ట్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో కేవలం రూ. 100 నుండి రూ. 500 కనీస డిపాజిట్‌తో, కేవైసీ (KYC) డాక్యుమెంట్లు ఇచ్చి ఈ రోజే మీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications