Investment: గడచిన కొన్ని త్రైమాసికాలుగా దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ పనితీరులో గణనీయమైన పురోగతిని సాధించాయి. ప్రైవేటు బ్యాంకులతో పోటీ పడుతూ తమ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తున్నాయి.
షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నప్పటికీ.. ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల షేర్ల గత ఏడాది కాలంలో 250 శాతం రాబడిని అందించాయి. ఈ క్రమంలో బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటును పరిశీలిస్తే 7-8 శాతంగా ఉంది. అంటే ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే వడ్డీ తర్వాత కూడా లక్ష రూపాయల వాస్తవ విలువ ఏమాత్రం మారకుండా లక్షగానే ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా
గత ఏడాది కాలంలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 55 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి. బుధవారం మార్కెట్లో స్టాక్ రూ.214.75 ధర వద్ద ముగిసింది. అంటే ఒక్క ఏడాదిలో రూ.లక్ష పెట్టుబడి రూ.1,55,000గా మార్చింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ఏడాదిలో 112 శాతం రాబడిని పెట్టుబడిదారులకు అందించింది. అంటే ఒక్క ఏడాదిలో లక్ష రూపాయలు 2.12 లక్షలుగా మారిపోయాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ బుధవారం నాడు రూ.108.45 వద్ద ముగిసింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్టాక్ కూడా తమ పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది. ఒక్క ఏడాదిలో 154.89 శాతం రాబడిని అందించి రూ.47.41కి చేరింది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే రూ.లక్ష పెట్టుబడిని రూ.2.54 లక్షలుగా మార్చింది. ఇక కెనరా బ్యాంక్ గురించి చెప్పుకుంటే.. ఏడాది కాలంలో 51.24 శాతం రాబడిని అందించింది. అంటే ఇన్వెస్టర్ల డబ్బు సొమ్ము ఒకటిన్నర రెట్లు పెరిగింది. బుధవారం రూ.374.25 వద్ద ముగిసింది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ఏడాదిలో 133 శాతానికి పైగా పెరిగాయి. ఇప్పుడు రూ.50.59కి చేరింది. ఈ కాలంలో ఇండియన్ బ్యాంక్ కూడా 111 శాతం బలమైన రాబడిని ఇచ్చింది. ఇప్పుడు రూ.431.60కి చేరింది. అంటే ఒక్క ఏడాదిలో డబ్బు రెండింతలు పెరిగింది.IOB ఏడాదిలో లక్షను రూ.2.37 లక్షలుగా మార్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ డబ్బును డబుల్ చేయగా.. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 181.96 శాతం బంపర్ రాబడిని అందించింది. UCO బ్యాంక్ అత్యధికంగా మూడున్నర రెట్లు రాబడిని ఇవ్వగా.. యూనియన్ బ్యాంక్ 122.50 శాతం రాబడిని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యల్పంగా 3.13 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications