SBI: క్లెయిమ్ చేయని డిపాజిట్లను RBIకి పంపిన PSBలు.. ఎంత మొత్తమో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
SBI: ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులు, బీమా కంపెనీలపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. తదనంతరం తమ వారికి అవి చెల్లింపు జరిగేలా నామినేషన్ సైతం జోడిస్తారు. ఒకవేళ వాటిని ఎవరూ క్లైమ్ చేయనట్లైతే అప్పుడు బ్యాంకులు ఏమి చేస్తాయో తెలుసా ? ఈ క్రమంలో RBI నిబంధనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్లెయిమ్ చేయని దాదాపు 35 వేల కోట్ల డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSB) RBIకి బదిలీ చేసినట్లు లోక్‌సభకు ప్రభుత్వం తెలియజేసింది.
ఈ విషయంలో 8 వేల కోట్లకు పైగా నిధులతో SBI అగ్రస్థానంలో ఉండగా.. 5.3 వేల కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్, 4.5 వేల కోట్లతో కెనరా బ్యాంకులు తరువాతి స్థానాలను ఆక్రమించినట్లు పేర్కొంది.

'ఈ నిధులను సెటిల్ చేసేందుకు మరణించిన వారి కుటుంబీకులకు సాధ్యమైనంత వరకు సహాయం అందించినట్లు SBI వెల్లడించింది. ఈ వ్యవహారంపై బ్యాంకు సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు సంస్థకు సంబంధించిన అన్ని ఫోరమ్ లలో ఎప్పటికప్పుడు సూచనలు చేసినట్లు స్పష్టం చేసింది' అని లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
మరణించిన వ్యక్తుల ఖాతాలకు సంబంధించి చట్టపరమైన ప్రాతినిధ్యం లేని క్లెయిమ్‌లు, నిబంధనల ప్రకారం లేని పత్రాలు వంటి ఇబ్బందులను అధిగమించడానికి SBI ప్రయత్నించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజలు సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా బ్యాంకు సైట్ లోని FAQ సెక్షన్‌లో వివరాలను అప్ లోడ్ చేసినట్లు చెప్పారు. ఇందుకు అదనంగా సెటిల్ మెంట్ కోసం వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఓ గుర్తింపు సంఖ్యను సైతం కేటాయించినట్లు వెల్లడించారు. తిరస్కరించబడిన క్లెయిమ్ కు సంబంధించి కారణాలు, సలహా సైతం అక్కడ ఇచ్చినట్లు తెలిపారు.
ఏడాది కంటే ఎక్కువ కాలం ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతాలను బ్యాంకులు సమీక్షించాలని RBI నిబంధనలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని వినియోగదారులను సంప్రదించి, వారికి వ్రాతపూర్వకంగా తెలియజేయాలి. అందుకు గల కారణాలను నిర్ధారించుకోవాలి. అదే రెండేళ్లపాటు ట్రాన్సాక్షన్స్ జరగని పక్షంలో ఖాతాదారులు లేదా చట్టపరమైన వారసుల ఆచూకీ కోసం ప్రత్యేక డ్రైవ్ ను సైతం ప్రారంభించాలని RBI సూచిస్తోంది. క్లెయిమ్ చేయని డిపాజిట్‌లకు సంబంధించి పదేళ్లపాటు లావాదేవీలు జరపని ఖాతాదారుల పేర్లు, చిరునామాలతో కూడిన జాబితాను బ్యాంకులు తమ వెబ్ సైట్ లలో ప్రదర్శించాలి.


Click it and Unblock the Notifications