US Visa: అమెరికాలో స్థిరపడాలి, నాలుగు డాలర్లు వెనకేసుకుని ఊళ్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నది చాలా మంది నేటి భారతీయ యువతకు తరతరాలుగా వచ్చిన ఇన్పిరేషన్. అక్కడి డాలర్లతో ఇక్కడ స్థలాలు, భూములు, వ్యాపారాల ద్వారా స్థిరపడిన కుటుంబాలు కోకొల్లలు. కానీ కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోకి అడుగుపెడుతున్న వేళ ఇకపై అమెరికా కలలు కష్టతరంగా మారిపోతున్నాయి. అలాగే ట్రంప్ గ్రీన్ కార్డుల విషయంలోనూ రూల్స్ మార్చాలని చూస్తున్న వేళ అమెరికా వీసాల విషయంలో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని తెలుస్తోంది.
H-1B వీసా ప్రోగ్రాం సమగ్ర నియంత్రణ సవరణకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం వైట్‍హౌస్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ సమీక్షలో ఉందని బ్లూమ్‍బెర్గ్ నివేదించింది. గత సంవత్సరం యూఎస్ పౌరసత్వం అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి సాంకేతిక పరిశ్రమ ప్రధానంగా ఉపయోగించే స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాల కోసం డిగ్రీ అవసరాలతో సహా అర్హత ప్రమాణాలను సర్దుబాటు చేసే డ్రాఫ్ట్ నిబంధనలను జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో హెచ్1బీ వీసాలను లాటరీ పద్దతిలో అందించటం వల్ల ప్రతి దరఖాస్తుదారునికి వీసా పొందేందుకు అవకాశం కల్పించబడింది. అయితే కొత్త సంవత్సరం ప్రారంభం అవటానికి ముందు ప్రస్తుతం తిరిగి మార్పులకు అమెరికా శ్రీకారం చుట్టడం గమనార్హం.

ఏటా హెచ్1బీ వీసాలను గరిష్ఠంగా 85,000 అందించటానికి పరిమితం చేయబడింది. గత సంవత్సరం వ్యవసాయ, వ్యవసాయేతర కాలానుగుణ కార్మికులకు సేవలందించే తాత్కాలిక H-2A, H-2B వీసా కార్యక్రమాల్లో అక్రమ రుసుములు, ఇతర దుర్వినియోగాలపై అమెరికా దృష్టి సారించింది. ప్రతిపాదిత నిబంధనలలో కార్మికుల రక్షణలను ఉల్లంఘించినట్లు గుర్తించిన యజమానులపై ఏకంగా 4 ఏళ్ల పాటు నిషేధం వంటి జరిమానాలను డ్రాఫ్ట్ రూపంలో విడుదల చేసిన ఒక నియమంలో వెల్లడించింది. ఈ సీజనల్ వీసా ప్రోగ్రామ్‌లకు అర్హులైన దేశాల జాబితాను ఏటా ప్రచురించాల్సిన అవసరాన్ని కూడా ప్రతిపాదన తొలగించటం గమనార్హం.
వాస్తవానికి H-1B వీసా ప్రోగ్రామ్ అమెరికా యజమానులు తాత్కాలికంగా విదేశీ ఉద్యోగులను ప్రత్యేక వృత్తుల్లో నియమించుకోవడానికి అనుమతిస్తుంది. ఈ క్రమంలో వారికి సైద్ధాంతిక, ఆచరణాత్మక నైపుణ్యం అవసరం. దీనికోసం సదరు వ్యక్తులు బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతను కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, మెడిసిన్, ఎడ్యుకేషన్, బిజినెస్, లా అండ్ ఆర్ట్స్ వంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా దీనికింద అర్హత గల ఫీల్డ్‌లు ఉన్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం అమెరికాలోని దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, ఐబీఎమ్ వంటి ప్రముఖ కంపెనీలు 2024లో తక్కువ H-1B వీసాలను స్పాన్సర్ చేశాయని వెల్లడైంది. 2023 ఆర్థిక సంవత్సరంలో జారీ చేయబడిన మొత్తం 386,000 H-1B వీసాల్లో భారతీయ పౌరులు 72.3% దక్కించుకోవటం గమనార్హం.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రధానంగా టాప్ ఐటీ కంపెనీలకు అందించిన హెచ్1బీ వీసాల ఆమోదం సంఖ్య భారీగా 7299కి తగ్గించబడింది. ఇదే సంఖ్య 2015 ఆర్థిక సంవత్సరంలో పరిశీలిస్తే ఏకంగా 14,792గా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 20 ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తన మెుదటి టర్మ్ అధ్యక్ష సమయంలో మాదిరిగా నిర్బంధ ఇమ్మిగ్రేషన్ విధానాలను పునరుద్ధరిస్తే హెచ్1బీ వీసాల తిరస్కరణ రేటు తిరిగి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యూఎస్ వీసాల కోసం విద్యార్థుల హడావిడి..
జనవరి 20న అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న వేళ అమెరికాలోని యూనివర్సిటీలు అప్రమత్తం అయ్యాయి. 2017లో మెుదటి సారి ట్రంప్ గెలిచినప్పుడు ఎదురైన పరిస్థితుల దృష్యా తమ విదేశీ విద్యార్థులను ముందుగానే అప్రమత్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న విద్యార్థులు ట్రంప్ అధ్యక్షుడిగా జనవరిలో బాధ్యతలు చేపట్టే సమయానికి భౌతికంగా అమెరికాలో ఉండాలని సూచిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇతరదేశాల్లో ఉన్న తమ సిబ్బందికి కూడా ఇదే తరహా సూచనలు చేసాయి. ఈ క్రమంలో యేల్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ ఆఫీస్ ఇటీవల ఇమ్మిగ్రేషన్ పాలసీ మార్పులపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి వెబినార్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications