Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో ఫేజ్ 3లో డబుల్ డెక్కర్ మార్గం..!
బెంగళూరులో మెట్రో ఫేస్ 3కి సంబంధించి పలు అప్డేట్స్ వస్తున్నాయి. రూ.15,611 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో బెంగళూరు మెట్రో ఫేజ్ 3కి కేంద్రం ఆగస్టు 2024లో ఆమోదం తెలిపింది. 44.65 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో 31 స్టేషన్లతో కూడిన రెండు కారిడార్లు ఉన్నాయి. దీనిని 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కారిడార్ 1, జేపీ నగర్ 4వ ఫేజ్ నుంతి కెంపుర వరకు ఔటర్ రింగ్ రోడ్ వెస్ట్ వెంబడి 32 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. ఇందులో 21 స్టేషన్లు ఉన్నాయి. కారిడార్ 2, మాగడి రోడ్ వెంబడి హోసహళ్లి నుంచి కడబగెరె వరకు 12.5 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మించనున్నారు ఇందులో 10 స్టేషన్లు ఉన్నాయి.
మంజూరైన ఈ ప్రాజెక్టులో రెండు కూడళ్ల వద్ద సుమారు 3 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రతిపాదన చేశారు. ఔటర్ రింగ్ రోడ్‌లోని కనకపుర రోడ్ కూడలి వద్ద 1.4 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, కామాఖ్య కూడలి వద్ద 1.6 కిలోమీటర్లు. గోరగంటెపల్యతో సహా ప్రధాన ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల వద్ద మరో 8 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ నిర్మాణాలను ప్రతిపాదించారు, దీంతో మొత్తం డబుల్ డెక్కర్ మార్గం పొడవు సుమారు 11 కిలోమీటర్లకు చేరుతుంది. కర్ణాటక ప్రభుత్వం నవంబర్ 2022లో రెండు ఫేజ్ 3 కారిడార్లను ఆమోదించగా, కేంద్రం ఆగస్టు 2024లో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 10, 2025న బెంగళూరు మెట్రో ఫేజ్ 3కు శంకుస్థాపన చేశారు.

ఏడాది గడిచినా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ ఆర్డర్లు ఇంకా జారీ కాలేదు. "కేంద్రం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపి రెండేళ్లకు పైగా అయింది, శంకుస్థాపన జరిగి ఏడాది అయింది, కానీ టెండర్ ఇంకా ఖరారు కాలేదు. ఈ జాప్యానికి డబుల్ డెక్కర్ భాగాన్ని అనుసంధానించడమే ఒక ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రతి ఏడాది జాప్యంతో ప్రాజెక్టు వ్యయం సుమారు 10 శాతం పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ అదనపు భారం చివరికి ప్రయాణికులపై పడుతుందని వివరిస్తున్నారు. దేశంలోనే బెంగళూరులో అత్యధిక మెట్రో ఛార్జీలు ఉండటానికి ఇది కూడా ఒక కారణమని అంటున్నారు.
పరిమిత రహదారి స్థలం, అధిక భూసేకరణ వ్యయాలను కారణంగా డబుల్ డెక్కర్ మార్గాన్ని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 9,700 కోట్ల అంచనా వ్యయంతో అదనంగా 37 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ రోడ్డు భాగానికి ఆమోదం తెలిపింది. అయితే సవరించిన డిజైన్‌కు కేంద్రం నుంచి కొత్తగా ఆమోదం అవసరం. పూర్తి స్థాయి డబుల్-డెక్కర్ డిజైన్‌ను అంచనా వేయడానికి BMRCL, IIT రూర్కీని నియమించింది. సవరించిన ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ. 25,999 కోట్లగా పెరిగే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications