ఆస్తిని కొనుగోలు చేయడం కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు.. ఇది ఒక పెద్ద బాధ్యత కూడా అని చెప్పవచ్చు. మీరు Property కొనుగోలు సమయంలో సరైన సమాచారం లేకుండా, లేదా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల గణనీయమైన ఆర్థిక నష్టాలు, చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల, భూమిని కొనుగోలు చేసే ముందు కొన్ని కీలక అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం అత్యంత ముఖ్యం.
ముందుగా భూమి యొక్క ప్రస్తుత విలువను అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. భవిష్యత్‌లో దాని ధర ఎంత పెరుగుతుందో ముందస్తుగా పరిశీలించండి. విక్రేత మాటపై మాత్రమే మీరు ఆధారపడకండి. చుట్టుపక్కల ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న రేట్లు, ప్రభుత్వ సర్కిల్ రేట్లు (మార్గదర్శక విలువ), భవిష్యత్ అభివృద్ధి ప్రాజెక్టులు వంటివి పరిగణలోకి తప్పకువండా తీసుకోండి. ఉదాహరణకు రోడ్లు, మాల్‌లు లేదా మెట్రో స్టేషన్లు, ప్లాట్ల విలువ పెరుగుదలపై విపరీతమైన ప్రభావం చూపుతాయి. మంచి ప్రాంతాన్ని ఎంచుకోవడం ద్వారా కొనుగోలుదారులకు నికర లాభాలను పెంచుతుంది.

మీరు ఏ భూమిని కొనుగోలు చేయడానికి ముందే దాని యాజమాన్య హక్కులను జాగ్రత్తగా పరిశీలించాలి. వివాదాస్పద లేదా వ్యాజ్యంలో ఉన్న భూమి నుండి మీరు తప్పించుకోవడం మంచిది.టైటిల్ డీడ్, సేల్ డీడ్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వంటి ముఖ్యమైన పత్రాలను సమీక్షించండి. అవసరమైతే న్యాయవాదిని సంప్రదించి, మీ హక్కులు రక్షించబడుతున్నాయా లేదా అనేదానిని నిర్ధారించుకోండి.
భారతదేశంలో నివాస, వ్యవసాయ, వాణిజ్య లేదా పారిశ్రామిక వంటి విభిన్న రకాల భూములు ఉన్నాయి. ఇల్లు నిర్మించడానికి నివాసయోగ్యమైన భూమి ఉండాలి. వ్యవసాయ భూమిలో ఇల్లు నిర్మించడం చట్టపరమైన సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి, మునిసిపాలిటీ లేదా పంచాయతీ నుండి భూమి యొక్క జోనింగ్ (భూ వినియోగ సమాచారం)ని ధృవీకరించాలి.
భూమి విలువ, జీవన సౌకర్యం ప్రధానంగా స్థానంపై ఆధారపడి ఉంటుంది. పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, రోడ్లు, బస్సు లేదా మెట్రో స్టేషన్లు దగ్గరగా ఉండడం ముఖ్యంగా ముఖ్యం. సమీపంలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు ప్లాట్ల విలువను మరింత పెంచుతాయి. కాబట్టి మీరు కొనే సమయంలో ఆచితూచి అడుగులు వేయవలిసి ఉంటుంది.
కొన్నిసార్లు పత్రాల్లో చూపిన భూమి ప్రాంతం వాస్తవానికి తేడా ఉంటుంది. GPS లేదా ప్రభుత్వ రికార్డులతో భౌతిక కొలతలను ధృవీకరించాలి. ఆమోదించని ప్లాట్లు నిర్మాణ పరిమితులు, సరిహద్దుల వివాదాలకు దారి తీస్తాయి. కాబట్టి వాటిపై చాలా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. లేకుంటే మీరు కొనుగోలు చేసిన తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎందుకు కొనుగోలు చేశామని భాదపడాల్సి ఉంటుంది.
భవిష్యత్తులో ఆర్థిక నష్టాలు, చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి భూమి కొనుగోలు ముందు జాగ్రత్తగా పరిశీలన ,అలాగే సరైన పరిశోధన అవసరం. భూమి విలువ, యాజమాన్యం, రకం, జోనింగ్, స్థానిక సౌకర్యాలు, కొలతలను ఖచ్చితంగా తెలుసుకోవడం పెట్టుబడికి భద్రమైన దిశ ని నిర్ధారిస్తుంది.
More From GoodReturns

ప్రాప్షేర్ సెలెస్టియా REIT ఐపీఓ: నేడే చివరి అవకాశం!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

హైదరాబాద్ నీటి కష్టాలు: ఐటీ కారిడార్లో అద్దెలు ఆకాశానికి!

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్లో పెరిగిన డిమాండ్!

అమరావతి రియల్ ఎస్టేట్: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయా?

అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications