Hyderabad: ధరలు పెరిగినా తగ్గని ఇళ్ల అమ్మకాలు..!

కంపెనీల లే ఆఫ్స్, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఇళ్ల కొనుగోలు భారీగా పడిపోయింది. ఈ ఏడాది జూలై, సెప్టెంబర్ క్వార్టర్ లో 9 ప్రధాన నగరాల్లో కేవలం 1,03,170 ఇళ్లు మాత్రమే విక్రయించినట్లు ప్రాప్‌ఈక్విటీ నివేదిక పేర్కొంది. ఈ అమ్మకాలు గత సంవత్సం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 6 శాతం తగ్గాయి. గత ఏడాది జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో 1,09,420 ఇళ్లు అమ్ముడయ్యాయి.
ముంబై, నవీ ముంబై, థానే, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతాలో ఇళ్ల అమ్మకాలను పరిశీలించినట్లు ప్రాప్‌ఈక్విటీ పేర్కొంది. ఈ త్రైమాసికం వర్షాకాలం కావడంతో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కొంత నెమ్మదించడం కూడా అమ్మకాలు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు.

రెండో త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విచిత్రంగా అన్న నగరాల కంటే హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోలు ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో 15,470 ఇళ్లు అమ్ముడయ్యాయి. అంటే గతేడాది ఈ సంఖ్య 13,890 గా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 11 శాతం ఇళ్ల విక్రయాలు పెరిగాయి. అటు నవీ ముంబైలో కూడా విక్రయాలు పెరిగాయి. అమ్మకాలు 12 శాతం పెరిగి 9,810 యూనిట్లకు చేరాయి. బెంగళూరులో ఇళ్ల విక్రయాలు సాధారణంగా ఉన్నాయి. ఇక్కడ గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 17,170 ఇళ్లు అమ్ముడు అవ్వగా.. ఇప్పుడు 17,340 ఇళ్లు అమ్ముడయ్యాయి. అంటే ఒక శాతం వృద్ధి నమోదు అయింది.

Houses

పుణెలో అనుహ్యాంగా అమ్మకాలు తగ్గాయి. అక్కడ గతేడాదితో పోల్చితే అమ్మకాలు 16 శాతం తగ్గి 17,860 ఇళ్లు అమ్ముడయ్యాయి. చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 17 శాతం తగ్గాయి. జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో 4,680 ఇళ్లను విక్రయించారు. థానేలో గతేడాది ఇదే త్రైమాసికంలో 18,240 ఇళ్లు అమ్ముడవ్వగా.. ఇప్పుడు 16,230 ఇళ్లకు తగ్గాయి. ముంబైలో ఈ త్రైమాసికంలో 9,830 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇళ్ల అమ్మకాలు 12 శాతం క్షీణించాయి. జూలై నుంచి సెప్టెంబర్ వరకు 8,090 ఇళ్లను విక్రయించారు. కోల్‌కతాలో ఇళ్ల విక్రయం 17 శాతం తగ్గింది. ఇక్కడ ఈ త్రైమాసికంలో 3,860 ఇళ్లు అమ్ముడయ్యాయి.

ఇక కొత్త ఇళ్ల నిర్మాణం కూడా నత్తనడకన కొనసాగుతోంది. ఈ త్రైమాసికంలో కొత్త ఇళ్ల నిర్మాణం 98,165 తగ్గింది. గతేడాది ఇది 1,00,330 ఇళ్లుగా ఉంది. నగరాల వారీగా కొత్త లాంచ్‌లలో థానేలో త్రైమాసిక ప్రాతిపదికన 28 శాతం, చెన్నైలో 22 శాతం, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 19 శాతం క్షీణించాయి. పలు నగరాల్లో ధరలు పెరిగినా ఇళ్ల అమ్మకాలు తగ్గడం లేదు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+