Dividend Income: చాలా మంది ఇన్వెస్టర్లు ఎక్కువగా డివిడెండ్ ఆదాయాన్ని ఇచ్చే షేర్లలో దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగిస్తుంటారు. ఇలాంటి క్వాలిటి షేర్లలో ఇన్వెస్ట్ చేయటం ద్వారా కేవలం ఆదాయంతో పాటు క్యాపిటల్ అప్రీసియేషన్ లభిస్తుంది. అయితే ఈ క్రమంలో చాలా మంది వందల్లోనో లేక వేలల్లోనో డివిడెండ్ రూపంలో రిటర్స్న్ పొందుతుంటారు. మహా అయితే లక్షల్లో ఆదాయం ఉండవచ్చు. కానీ కొంత మంది విషయంలో ఈ డివిడెండ్ ఆదాయం ఏకంగా వేల కోట్ల రూపాయలుగా ఉందనే విషయం వినగానే గుండె ఆగిపోతుంది. కానీ ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం.
AceEquity ద్వారా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత, హిందుస్థాన్ జింక్‌ల ప్రమోటర్ గ్రూపులు అత్యధిక డివిడెండ్ ఆదాయాన్ని పొందాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రభుత్వరంగ కంపెనీలైన ONGC, కోల్ ఇండియా నిలిచాయి. ఈ రెండు కంపెనీలు భారత ప్రభుత్వానికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. గడచిన 12 నెలల కాలంలో దేశంలోని 5 కంపెనీల ప్రమోటర్లకు మాత్రం డివిడెండ్ ఆదాయం వేల కోట్ల రూపంలో వెళ్లింది. పైగా ఆ కంపెనీల్లో ప్రమోటర్ల వాటా మంచి స్థాయిలో ఉందని తెలుస్తోంది.

ముందుగా దేశంలోని రెండవ అత్యంత విలువైన కంపెనీ అయిన TCS.. గడచిన 12 నెలల కాలంలో ఒక్కో షేరుకు రూ.113 డివిడెండ్ చెల్లించింది. ఈ కంపెనీలో 72.3 శాతం ఈక్విటీ వాటాలను టాటా సన్స్ కలిగి ఉంది. దీంతో వారికి సుమారుగా డివిడెండ్ రూపంలో రూ.29,900 కోట్లను పొందారు. దీని తర్వాత మైనింగ్ కింగ్ అనిల్ అగర్వాల్ కంపెనీ వేదాంత గడచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.101.5 డివిడెండ్ చెల్లించింది. దీంతో కంపెనీలో 69.69 శాతం ఈక్విటీ వాలాలను కలిగి ఉన్న బిలియనీర్ ప్రమోటర్ డివిడెండ్ రూపంలో రూ.26,000 కోట్లను అందుకున్నారు.

ఇక హిందుస్తాన్ జింక్ 12 నెలల కాలంలో ఒక్కో షేరుపై దాదాపు రూ.75.50 డివిడెండ్ చెల్లించింది. దీంతో ప్రమోటర్లు కంపెనీ నుంచి డివిడెండ్ రూపంలో రూ.20,700 కోట్లను పొందారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ONGC గడచిన ఏడాదిలో ఒక్కో షేరుపై రూ.14 డివిడెండ్ చెల్లించింది. దీంతో కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ.10,300 కోట్లు డివిడెండ్ ఆదాయం అందింది. చివరిగా పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఉన్న కోల్ ఇండియా సైతం మంచి ఆదాయాన్ని ప్రభుత్వానికి అందించింది. గడచిన 12 నెలల కాలంలో కంపెనీ ఒక్కో షేరుపై రూ.23.25 డివిడెండ్ చెల్లించింది. దీంతో కంపెనీలో 66.1 శాతం వాటాను కలిగి ఉన్న ప్రభుత్వానికి రూ.9,475 కోట్లు డివిడెండ్ ఆదాయం వచ్చి పడింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications