Akkineni Nagarjuna: సంపన్న నటుడిగా అక్కినేని నాగార్జున.. రూ.5 వేల కోట్లతో అగ్ర స్థానం..
చాలా మంది సినిమా నటులు సినిమాల్లో నటించడం ద్వారా డబ్బులతో జీవిస్తుంటారు. అయితే చాలా తక్కువ మంది నటులు ఆ డబ్బులతో బిజినెస్ లు స్టార్ట్ చేసి తమ ఆస్తులను పెంచుకుంటారు. సినిమాల్లో నటించడం ద్వారా వచ్చే పారితోషికమే కాదు.. తెరవెనుక వ్యాపారాలు, పెట్టుబడులు, ప్రకటనలు, సినిమా నిర్మాణం వంటి అనేక మార్గాల్లోనూ అగ్ర నటులు ఆదాయం పొందుతారు.
సాధారణంగా నటులకు రెమ్యునరేషన్ ద్వారా డబ్బులు వస్తా. అలాగే నటుడి మార్కెట్ ను బట్టి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటారు. ఇలా నటులకు ఆదాయాలు వస్తుంటాయి.
కొంత మంది నటులు ప్రముఖ కంపెనీల ఉత్పత్తులు, సర్వీసులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించి పారితోషికం తీసుకుంటారు. కొంత మంది నటులు సొంత ప్రొడక్షన్ హౌస్‌ల ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, విజువల్ ఎఫెక్ట్స్, డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యాపారాలు చేస్తుంటారు. కొంత మంది నటులు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడతారు. ఇళ్లు, భూములు, వాణిజ్య ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వార తమ సంపాదన పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వారికి అద్దె ఆదాయం లేదా ఆస్తి విక్రయం ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది.

కొందరు నటులు సొంతంగా వ్యాపారాలు చేస్తుంటారు. రెస్టారెంట్లు, వినోద రంగ సంస్థలు, క్రీడా జట్లలో వాటాలు, ఇతర వ్యాపార భాగస్వామ్యాల ద్వారా ఆదాయం లేదా ఆస్తి విలువ పెంచుకుంటారు. తెలుగు నటుడు అక్కినేని నాగార్జునకు ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారాలు, క్రీడా పెట్టుబడులతో సంబంధం ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆయన బిగ్‌బాస్, కౌన్ బనేగా కరోడ్‌పతి వంటి కార్యక్రమాలను నిర్వహించడం, జడ్జిగా వ్యవహరించడం, టెలివిజన్ ప్రాజెక్టుల్లో పాల్గొనడం ద్వారా పారితోషికం తీసుకుంటున్నారు. సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి నటుల టీవీ హోస్టింగ్ ఆదాయంపై మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇండియాలోని నటుల్లో చాలా మంది భారీగా ఆస్తులను సంపాదించారు. ఇందులో టాలీవుడ్ నుంచి కొంత మందికి స్థానం దక్కింది. షారుఖ్ ఖాన్ నుంచి నాగార్జున, చిరంజీవి, రామ్‌చరణ్ నటనతో కాకుండా బిజినెస్ లో కూడా రాణిస్తున్నారు. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ రూ.10,000 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. టాలీవుడ్ నుంచినాగార్జున అక్కినేని రూ.5,000 వేల కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అమితాబ్ బచ్చన్ రూ.4,000 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ.3,000 కోట్లు, హృతిక్ రోషన్ రూ.2,500 కోట్లు, అక్షయ్ కుమార్ రూ. 2,300 కోట్లు, ఆమిర్ ఖాన్ రూ.1,800 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి రూ .1,700, దగ్గుబాటి వెంకటేశ్ రూ. 1,650 కోట్లు, రామ్ చరణ్ రూ.1,400 కోట్లు ఆస్తులు కూడబెట్టారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
