జనవరిలో ఐపీఓల జాతర: రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సహా: కంప్లీట్ లిస్ట్ ఇదే

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం వచ్చేవారం ముగియబోతోంది. వచ్చే శుక్రవారం నాటికి ఈ థర్డ్ క్వార్టర్‌ క్లోజ్ అవుతుంది. స్టాక్ మార్కెట్‌లో పెద్దగా సందడి కనిపించట్లేదు ఇప్పటిదాకా. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా పుంజుకోవట్లేదు. బుధ, గురువారాల్లో కొంత ఫర్వాలేదనిపించిన మార్కెట్ల.. శుక్రవారం మళ్లీ దిగజారాయి. 196 పాయింట్ల మేర నష్టపోయాయి. ఈ పరిస్థితుల్లో వచ్చేవారం స్టాక్ మార్కెట్ అత్యంత కీలకంగా మారింది. కొత్త సంవత్సరాన్ని ఎలా డ్రైవ్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

కొత్త సంవత్సరం కావడం, ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆరంభం అవుతుండటం వల్ల పలు కంపెనీలు తమ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లను జారీ చేయడానికి సమాయాత్తమౌతోన్నాయి. వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఇన్వెస్టర్ల నుంచి సమీకరించుకోవడానికి సిద్ధం అయ్యాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్స్ గూడ్స్, రియల్టీ, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్.. ఇలా దాదాపు అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన పబ్లిక్ ఇష్యూలు స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కానున్నాయి.

 Prominent IPOs pipeline include Adani Wilmar, Go Airlines and Ruchi Soya likely to debut in January 2022

అదాని విల్మార్ కంపెనీ.. 4,500 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి మొబిలైజ్ చేయడానికి పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది. టాప్ సెల్లింగ్ వంటనూనె బ్రాండ్ ఫార్చూన్‌ను ఉత్పత్తి చేస్తోంది ఈ కంపెనీయే. అదాని ఎంటర్‌ప్రైజెస్, ఆసియన్ అగ్రి బిజినెస్ విల్మార్ ఇంటర్నేషనల్‌తో జాయింట్ వెంచర్‌గా ఏర్పడిందీ కంపెనీ. 2007 నాటికి దేశంలో లార్జెస్ట్ ఫుడ్ కంపెనీగా ఆవిర్భవించాలనేది అదాని విల్మార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పబ్లిక్ ఇష్యూకి వచ్చిన అనంతరం- అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి లిస్టెడ్ అయిన ఏడో కంపెనీగా గుర్తింపు పొందుతుంది.

కాగా- పబ్లిక్ ఇష్యూకు రావడానికి 35 కంపెనీలు సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతిని పొందాయి. ఆయా కంపెనీలు దాఖలు చేసిన రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌కు సెబి ఆమోదం తెలిపింది. మరో 33 కంపెనీలకు సంబంధించిన రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ పరిశీలన దశలో ఉన్నాయి. ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, అనలిటిక్ ఫర్మ కోర్స్ 5 ఇంటెలిజెన్స్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ ఆపరేటర్ డ్రీమ్ ఫోక్స్, టీబీఓ ట్రావెల్, సీజే డీఏఆర్‌సీఎల్ లాజిస్టిక్స్, క్యాంపస్ షూ వంటి కంపెనీలు పబ్లిక్ ఇష్యూను జారీ చేయనున్నాయి.

ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన రుచి సోయా కూడా ఊపీఓకు రావడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ కంపెనీ దాఖలు చేసిన రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌కు ఇప్పటికే సెబి అనుమతి లభించింది. వీటిల్లో ఏవి, ఎంత వరకు సక్సెస్ అవుతాయనేది మార్కెట్‌లో హాట్ డిబేట్‌గా మారింది. జనవరిలో కనీసం 12 నుంచి 15 కంపెనీలకు సంబంధించిన పబ్లిక్ ఇష్యూలు జారీ కావడానికి అవకాశం ఉందని, ఈ సంఖ్య దాటొచ్చని మార్కెట్ అనలిస్ట్ కంపెనీ ప్రైమ్ డేటా బేస్ చీఫ్ పృథ్వి హాల్దియా పేర్కొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+