Robert Kiyosaki: భవిష్యత్ అంతా ఏఐదేనా.. రాబర్ట్ కియోసాకి ఏం చెబుతున్నారు..!

ప్రముఖ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఎక్కువగా బంగారం, వెండి, బిట్ కాయిన్లు, స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతారు. కానీ తాజా ఆయన సెంట్రల్ బ్యాంకులు సోష్లల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచం కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తన పోస్ట్‌లో బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ (BIS) నివేదికను ప్రస్తావించారు. కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేస్తోందని ఆయన అంచనా వేశారు. జూలై 28న BIS విడుదల చేసిన విశ్లేషణలో ఏఐ ఒకేసారి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌, సరఫరా రెండింటినీ ప్రభావితం చేయడం వల్ల సాధారణ ఆర్థిక సంకేతాలు స్పష్టత కోల్పోతున్నాయని ఆర్థికవేత్తలు హెచ్చరించారని గుర్తు చేశారు.

ఆర్థిక వ్యవస్థలో అసలు పరిస్థితులను అంచనా వేయడం, దానికి అనుగుణంగా ద్రవ్య విధానాన్ని నిర్ణయించడం కేంద్ర బ్యాంకులకు కష్టం అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినా, తగ్గించినా వాటి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనిపించడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. అయితే ఏఐ వేగవంతమైన మార్పుల కారణంగా ఈ 'లాగ్‌' తగ్గిపోతోందని విశ్లేషించారు. కేంద్ర బ్యాంకులు నిర్ణయం తీసుకునేలోపే ఏఐ కారణంగా మార్కెట్లు, వ్యాపార కార్యకలాపాలు వేగంగా మారిపోయే పరిస్థితి ఉందన్నారు. డేటా సెంటర్లు, చిప్‌లపై భారీ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థలో వేడి పెరుగుతోందన్న సంకేతాలుగా కనిపించవచ్చన్నారు. అయితే అవి భవిష్యత్‌ ఉత్పాదకతను పెంచే దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా కావచ్చని కియోసాకి పేర్కొన్నారు.

Robert Kiyosaki

అదే సమయంలో ఏఐ ద్వారా ఉత్పాదకత పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉన్న డిమాండ్‌ ఒత్తిళ్లు బయటకు కనిపించకుండా పోయే అవకాశం ఉందని చెప్పారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాన్ని కూడా ఏఐ కొంతమేర సమతుల్యం చేస్తోందన్నారు. ముఖ్యంగా ఇరాన్‌ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ, ఏఐ ఆధారిత పెట్టుబడులు, ఉత్పాదకత వంటి అంశాలు ఆ ప్రభావాన్ని కొంతమేర ఎదుర్కొంటున్నాయని రాబర్ట్ కియోసాకి వివరించారు. తను ఇప్పటికీ బంగారం, వెండిపై బుల్లిష్ గా ఉన్నట్లు ఆయన గతంలో చెప్పారు. పసిడి ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని.. పలువురు నిపుణులు అంచా వేశారని ఆయన తెలిపారు.

ఆర్థికంగా అవగాహన ఉన్న పెట్టుబడిదారులు విలువ పెరిగే బంగారం, వెండి, బిట్‌కాయిన్‌, కొంత రియల్‌ ఎస్టేట్‌ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి సంపదను పెంచుకుంటారని చెప్పారు. తాను ఔన్సు బంగారం 300 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. వెండి ధర తక్కువగా ఉన్నప్పుడు, బిట్‌కాయిన్‌ను 6,000 డాలర్ల వద్ద ఉన్నప్పుడు కొనుగోలు చేసినట్లు వివరించారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+