Robert Kiyosaki On Gold: ప్రస్తుతం మీమ్మల్ని కాపాడేది బంగారం ఒక్కటే.. రాబర్ట్ కియోసాకి ఆసక్తికర పోస్ట్..!

ప్రముఖ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఆయన బంగారం, వెండి, స్టాక్ మార్కెట్, బిట్ కాయిన్ గురించి మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు ఇతర విషయాలు కూడా ఫాలోవర్స్ తో పంచుకుంటారు. రాబర్ట్ కియోసాకి ఎప్పుడైనా బంగారం, వెండిపై బుల్లిష్ గా ఉంటారు. ఆయన పసిడి, సిల్వర్ ధరలు పెరుగుతాయని ఎప్పటి నుంచి హెచ్చరిస్తున్నారు. తాజాగా ఆయన బంగారం, వెండి, రాగి ధరలపై ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

సాధారణంగా పసిడి, కాపర్ ధరలు భిన్నమైన ఆర్థిక సంకేతాలను ఇస్తాయని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పారిశ్రామిక డిమాండ్ కారణంగా రాగి ధర పెరుగుతుందని విశ్లేషించారు. ఆర్థిక వ్యవస్థపై నమ్మకం తగ్గినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లుతారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు భిన్నంగా బంగారం, వెండి, రాగి, ధరలు ఒకేసారి పెరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇదో భిన్న పరిస్థితిగా అభివర్ణించారు. 1978, 1998, 2006 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించాయని రాబర్ట్ కియోసాకి వివరించారు. ఇప్పుడు ఈ విషయం ఆందోళన కలిగిస్తుందని అన్నారు.

Roberto Kiyosaki On Gold

1980 మార్కెట్‌ కల్లోలం, డాట్‌కామ్‌ బబుల్‌ పతనం, 2008 ఆర్థిక సంక్షోభం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని రాబర్ట్ కియోసాకి గుర్తు చేశారు. బంగారం, వెండి, రాగి ధరలు ఒకేసారి పెరగడం కేవలం ద్రవ్యోల్బణానికి సంబంధించిన సంకేతం కాకపొవచ్చని అంచనా వేశారు. ఆర్థిక వ్యవస్థలోని వివిధ ఆస్తులు, కరెన్సీలపై ప్రజలు గతంలో ఉన్నంత నమ్మకంతో లేకపోవడానికి ఇది సంకేతం కావచ్చని వివరించారు. ప్రస్తుతం వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నారని గుర్తు చేశారు. 2022, 2023 సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు ఒక్కో ఏడాది 1,000 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేశాయని వివరించారు. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే ఆర్థిక మాద్యం వచ్చే ప్రమాదం లేకపోలేదన్నారు.

ప్రస్తుత పరిణామాలు మార్కెట్లు ప్రమాదంలో ఉన్నాయని చెప్పడం లేదని, అయితే పెట్టుబడిదారులు దేనికైనా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుత సమయంలో బంగారం, వెండి పై పెట్టుబడి పెడితే సురక్షితంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారులను కాపాడేది లోహాలేనని అంచనా వేశారు. అమెరికా, ఇరాన్ యుద్దం ఇంకా కొనసాగితే ద్యవ్యల్బణం పెరిగి పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+