Robert Kiyosaki: ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా బంగారం కొనుగోలు చేయాలా.. రాబర్ట్ కియోసాకి ఏమన్నారంటే..!

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ఆయన బంగారం, వెండి, బిట్ కాయిన్స్, స్టాక్ మార్కెట్ల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా రాబర్ట్ కియోసాకి బంగారం కొనుగోలుకు సంబంధించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు పడిపోతున్నాయని చాలామంది ఆందోళన చెందుతున్న వేళ తాను మాత్రం బంగారం, వెండి, బిట్ కాయిన్ కొనుగోలు చేసినట్లు వివరించారు. మార్కెట్ పడిపోయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను నమ్మిన పెట్టుబడులను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశంగా చూస్తానని పేర్కొన్నారు.

ఇప్పుడు ఆందోళన పడాల్సింది బంగారం, వెండి ధరలు తగ్గడం గురించి కాదు... ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ప్రభుత్వాలు అప్పులు పెరుగడంపై ఆందోళన ఉందని పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికా అప్పులు భారీగా పెరుగుతున్నాయని గుర్తు చేశారు. పాలకులు ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడుతున్నారని తెలిపారు. విద్యావ్యవస్థలో కూడా డబ్బు సంపాదించడం, పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం వంటి ఆర్థిక విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ముఖ్యమని వివరించారు. పిల్లకు చిన్నప్పటి నుంచే పర్సనల్ ఫైనాన్స్ పై చెప్పాలని సూచించారు. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు డబ్బు సరఫరాను పెంచినప్పుడు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

Robert Kiyosaki

కాగా బంగారం, వెండిపై బుల్లిష్ ఉన్నట్లు రాబర్ట్ కియోసాకి చెప్పారు. పసిడి పెట్టుబడి ఎప్పటికైనా లాభాదాయకమేనని పేర్కొన్నారు. అయితే బంగారం ధరలు భారీగా పడినప్పుడు కొనుగోలు చేస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉందని వివరించారు. స్వల్ప కాలంలో పసిడిలో ఒత్తడి ఉన్న దీర్ఘకాలంలో మంచి రాబడి ఇచ్చేదిగా ఉంటుందని అంచనా వేశారు. అలాగే డబ్బు మేనేజ్ మెంట్ గురించి కూడా వివరించారు. డబ్బు ఉంటే దాన్ని దాచి పెట్టవద్దని.. పెట్టుబడి పెడితేనే జీవితంలో సంపన్నులుగా మారుతారని సూచించారు. కొంత మంది రూపాయి రూపాయి కూడా బెట్టి బ్యాంకు ఖాతాలో ఉంచుతారు. దీని వల్ల ఫలితం శూన్యమని వివరించారు.

రాబడి వచ్చే వాటిపై పెట్టుబడి పెట్టాలను సూచించారు. డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టొచ్చని పేర్కొన్నారు. అయితే తక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నప్పుడ బంగారం పై పెట్టుబడి పెట్టాలని పేర్కొన్నారు. అయితే పెట్టుబడి మొత్తం ఒకే చోట పార్క్ చేసినా కూడా ఇబ్బందులు ఎదురై అవకాశం ఉంటుందని గుర్తు చేశారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+