Robert Kiyosaki: వెండి ఇప్పుడే కొనేయండి.. భారీ లాభాలు వస్తాయన్న రాబర్ట్ కియోసాకి..!
ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాగ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన ఫాలోవర్స్ కోసం పలు పోస్టులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పెట్టుబడి సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఆయన ఎక్కువగా బంగారం, వెండి, బిట్ కాయిన్, స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతారు. అలాగే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులపై కూడా సూచనలు చేస్తారు. తాజాగా ఆయన వెండి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెండి భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో వెండి ధర భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
తాను ఔన్స్ వెండి ధర 3 డాలర్లు కంటేట తక్కువ ఉన్నప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వెండి ధర భారీగా పెరిగినా కొనుగోలు కొనసాగిస్తున్నానని వివరించారు. వెండి సరఫరా, డిమాండ్ మధ్య తేడా భారీగా పెరుగుతుందని గుర్తు చేశారు. పలు దేశాలు భారీగా వెండిని నిల్వ చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రపంచ జనాభాలో దాదాపు 40 శాతాన్ని కలిగి ఉన్న మూడు ప్రభుత్వాలు ఒకే లోహాన్ని భారీగా నిల్వ చేస్తున్నాయని రాబర్ట్ కియోసాకి గుర్తు చేశారు. ఇది ఆభరణాల కోసం కాకుండా భవిష్యత్ అవసరాలు, భద్రత కోసం నిల్వ చేసుకుంటున్నారని వివరించారు.

బంగారాన్ని ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు నిల్వ చేస్తుంటే.. వెండిలో మాత్రం పారిశ్రామిక వినియోగం భారీగా ఉందని కియోసాకి గుర్తు చేశారు. స్మార్ట్‌ఫోన్లు, సోలార్ ప్యానెల్స్, రక్షణ రంగ పరికరాలు సహా అనేక ఉత్పత్తుల్లో వెండి వినియోగం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ వినియోగం కారణంగా అందుబాటులో ఉన్న సరఫరాపై ఒత్తిడి పెరుగుతోందని వివరించారు. సరఫరా పరిమితంగా ఉండటం, డిమాండ్ ఏటా పెరుగుతుండటం భవిష్యత్‌లో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. గత 30 ఏళ్లలో వెండిలో పెరుగుతున్న ధోరణి చూస్తున్నట్లు పేర్కొన్నారు.
గతంలో వెండి పెరుగుతుందని చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ అప్పట్లో చాలామంది తనను విమర్శించారని తెలిపారు. ఇప్పుడు మూడు ప్రభుత్వాలు వెండిని నిల్వ చేయడం ద్వారా తాను చెబుతున్న మాటలను బలపరుస్తున్నారని పేర్కొన్నారు. వెండి ధర భవిష్యత్‌లో ఔన్స్‌కు 200 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని పోస్ట్ చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications