Robert Kiyosaki: బంగారం ధర భారీగా పెరిగే అవకాశం.. ఇప్పుడే కొనేయండి..!

బంగారం ధర రాకెట్ వేగంతో పరుగులు పెడుతోంది. అయితే పసిడి ధర ఇంకా పెరుగుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. బంగారానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. పెట్టుబడిదారులు కాకుండా అమెరికా డాలర్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నట్ట్లు తెలిపారు. ప్రపంచ దేశాలు అమెరికా డాలర్లకు బదులుగా బంగారాన్ని నిల్వ చేసుకునే విధానం పెరిగిందని.. ఇద గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని కియోసాకి పేర్కొన్నారు.

1971 ఆగస్టు 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ డాలర్‌ను బంగారంతో మార్పిడి చేసే విధానాన్ని నిలిపివేస్తున్నట్లు రాబర్ట్ కియోసాకి గుర్తు చేశారు. అప్పట్లో ఇది తాత్కాలిక నిర్ణయమని చెప్పినప్పటికీ 54 ఏళ్లుగా అది కొనసాగుతోందని వివరించారు. అంతకుముందు డాలర్‌ విలువకు బంగారం ఆధారం ఉండేదని, ఆ తర్వాత అది ప్రభుత్వంపై, దాని విశ్వసనీయతపై ఆధారపడే కరెన్సీగా మారిందని తెలిపారు. అమెరికా అప్పులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ డాలర్‌ నిల్వలను బంగారంగా మార్చుకునే విధానం పెరుగిపోతుందని అంచనా వేశారు.

Robert Kiyosaki On Gold

తన రిచ్‌ డాడ్‌ నుంచి నేర్చుకున్న పాఠాన్ని రాబర్ట్ కియోసాకి ఇక్కడ ప్రస్తావించారు. ఇతరుల హామీపై ఆధారపడే డబ్బు, ఎవరి హామీ అవసరం లేని డబ్బు అనే రెండు రకాల సంపద ఉంటాయని గుర్తు చేశారు. అయితే బంగారాన్ని కేవలం కొనుగోలు చేసి భద్రపరచడం కంటే, బంగారాన్ని ఉత్పత్తి చేసే గనుల్లో పెట్టుబడి పెట్టడమే మంచి నిర్ణయమని పేర్కొన్నారు. బంగారు గనుల్లో పెట్టుబడి పెడితే బంగారం విలువతో పాటు గని ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఆ వ్యాపారం పెరిగే కొద్దీ లభించే విలువ కూడా పెట్టుబడిదారుడికి దక్కుతుందని వివరించారు.

అయితే ఇప్పటికైనా బంగారం, వెండిలో పెట్టుబడి పెడితే మంచిదని సూచించారు. బంగారం, వెండి ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. పసిడికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ధరలు ఇంకా పైకి వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. బంగారంపై గతంలో వచ్చిన రిటర్న్స్ రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+