Robert Kiyosaki: భవిష్యత్ అంతా బంగారం, వెండిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన రాబర్ట్ కియోసాకి..!
ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడూ తన ఫాలోవర్స్ కు ఏదో ఒక సలహా ఇస్తుంటారు. ముఖ్యంగా ఆయన పెట్టుబడులు, స్టాక్ మార్కెట్, బంగారం, వెండి, బిట్ కాయిన్, రియల్ ఎస్టేట్ పై అవగాహన కల్పిస్తుంటారు. భవిష్యత్తులో దేనికి డిమాండ్ ఉంటుంది. ఎందులో పెట్టబడి పెడితే మంచిదో చెబుతుంటారు. అంతే కాదు.. ఉద్యోగం కంటే బిజినెస్ చేయాలని సూచిస్తుంటారు. ఉద్యోగం చేస్తే సేఫ్ జోన్ లో ఉంటారు తప్ప గ్రోత్ ఉండదని పేర్కొంటున్నారు. తాజాగా ఆయన ఎక్స్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు. అప్పులు పెరగడం వల్ల భవిష్యత్తులో డబ్బు విలువ తగ్గే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. అందుకే ఇప్పుడు బంగారం, వెండి వంటి ఆస్తులపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అమెరికా అప్పు త్వరలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని ఆయన అంచనా వేశారు. ప్రభుత్వాలు ఎక్కువగా అప్పులు చేస్తే.. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని చెప్పారు అప్పులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే.. చేతిలో ఉన్న డబ్బు విలువ తగ్గుతుందని పేర్కొన్నారు. ఇది ప్రజలపై తీవ్రమైన ప్రభావం అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

తనకు తెలిసిన ఆర్థిక నిపుణుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు బంగారం, వెండి ధరలపై భారీ అంచనాలు వేస్తున్నారని రాబర్ట్ కియోసాకి వెల్లడించారు. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బంగారం ధర ఔన్సుకు 10,000 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది జరగడం పక్కా కాదు.. కొందరు నిపుణులు చేస్తున్న అంచనాలు మాత్రమేనని తెలిపారు. మార్కెట్ పరిస్థితులు మారితే ఈ అంచనాలు కూడా మారే అవకాశం ఉందని చెప్పారు. బంగారం, వెండి రెండింటినీ గురించి మాట్లాడినప్పటికీ 2026 ఆగస్టులో తనకు మాత్రం వెండే మంచి ఎంపికగా కనిపిస్తోందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.
భవిష్యత్తులో వెండికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. వెండి కేవలం పెట్టుబడి లోహం మాత్రమే కాదన్నారు. సౌర విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఇతర పారిశ్రామిక రంగాల్లో కూడా వెండిని ఉపయోగిస్తున్నారని గుర్తు చేశారు. దీంతో భవిష్యత్తులో పారిశ్రామిక డిమాండ్ పెరిగితే వెండికి అదనపు మద్దతు లభించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే రాగి ధర కూడా పెరిగే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. అందుకే వెండి, బంగారం, రాగిలో పెట్టబడి పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications