Robert Kiyosaki On Gold: బంగారం, వెండి ఇప్పుడే కొనకండి.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక..!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్తర్ రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయన తరుచూ పెట్టుబడుల గురించి ట్వీట్లు చేస్తుంటారు. ముఖ్యంగా బంగారం, వెండి, బిట్ కాయిన్ల గురించి ఆయన ఎక్కువ మాట్లాడతారు. తాజా ఆయన ఓ ట్వీట్ చేశారు. బంగారం, వెండి, బిట్ కాయిన పడిపోతున్న సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ ధరలు పతనం ముగిసే వరకు ఆగండి అని సూచించారు. పతనం ఆగిన తర్వాత కొన్నుగోళ్లు మొదలు పెట్టండి అని చెప్పారు. ఏదైనా అస్థిరంగా ఉన్నప్పుడు దానిపై పెట్టుబడి పెట్టడం కింద పడిపోతున్న కత్తిని పట్టుకుంటున్నట్లే అని ఆయన వివరించారు.
బంగారం, వెండి ధరల తగ్గుదలకు ఫెడ్ తోనే సమస్య మొదలవుతుందని రాబర్ట్ కియోసాకి చెప్పారు. బ్లాక్‌రాక్ వంటి ప్రపంచంలోని పెట్టుబడి బ్యాంకులు, మన డబ్బు ద్వారా మన సంపదను దోచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. "పడిపోతున్న కత్తిని ఎప్పుడూ పట్టుకోవద్దు. అంటే కొనుగోలు చేసే ముందు పతనం ముగిసే వరకు వేచి ఉండండి. గత పతనం తర్వాత నేను ఒక కాయిన్‌కు $20,000 వద్ద బిట్‌కాయిన్ కొనడం ప్రారంభించాను. బిట్‌కాయిన్ మళ్లీ కనిష్ట స్థాయికి చేరే వరకు వేచి ఉంటాను" అని ఆయన ట్వీట్ చేశాడు. బ్యాంకింగ్ వ్యవస్థపై పడుతున్న అమెరికా రుణ సంక్షోభాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

ట్రిలియన్ అంటే 1 తర్వాత 12 సున్నాలు ఉండటమన్నారు. 1,000,000,000,000 అమెరికా డాలర్లు ప్రతి 90 రోజులకు 1 ట్రిలియన్ డాలర్లను ముద్రిస్తోందని పేర్కొన్నారు. క్వాడ్రిలియన్ అంటే 1 తర్వాత 15 సున్నాలు ఉండటమని.. డెరివేటివ్స్ మార్కెట్‌ను క్వాడ్రిలియన్లలో కొలుస్తారని విరించారు. 2008లో 'సబ్-ప్రైమ్ మార్ట్‌గేజ్' డెరివేటివ్స్ మార్కెట్ కుప్పకూలినప్పుడు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దాదాపు దానితో పాటే పతనమైందని గుర్తు చేశారు. రాబోయే పతనం 2008 నాటి దానికంటే చాలా పెద్దదని రాబర్ట్ కియోసాకి అభిప్రాయపడ్డారు. బహుశా అది ఒక ప్రపంచ ఆర్థిక మాంద్యం కావచ్చని అంచనా వేశారు.
"నేను చెప్పింది తప్పని ఆశిస్తున్నాను... కానీ ఒకవేళ నేను చెప్పింది నిజమైతే... బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం నన్ను అతి సంపన్నుల కోవలోకి నెట్టేస్తాయి" అని అన్నారు. ఏఐ ఉద్యోగాలను కబళిస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా AI ఉద్యోగ భద్రతను కబళించబోతోందని హెచ్చరించారు. వోక్స్‌వ్యాగన్ (VW) ఇప్పుడే లక్ష మంది ఉద్యోగులను తొలగించిందని గుర్తు చేశారు. యూరప్‌లో అల్లర్లు జరుగుతున్నాయని తాను 2002లో 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ'లో దీనిని ముందే ఊహించానని పేర్కొన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications