Closing Bell: ఉదయం లాభాల్లో ప్రయాణాన్ని మెుదలుపెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి నష్టాల్లో ముగిశాయి. లాభాలు ఇంట్రాడేలో ఆవిరి కావటంతో నెల చివరి రోజును దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 189 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 39 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 27 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 34 పాయింట్లు లాభపడింది. ప్రధానంగా ఐటీ, మెటల్ స్టాక్స్ నేడు మార్కెట్లను కిందకు లాగాయి. ఇదే క్రమంలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ సూచీ ఫ్లాట్ ముగింపును నమోదు చేసింది.

ఎన్ఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటార్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, మారుతీ, ఎస్బీఐ లైఫ్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనీలివర్, దివీస్ ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో టెక్ మహీంద్రా, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఎల్ టి, కోటక్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, ఎస్బీఐ, ఐటీసీ, సిప్లా, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications