Market Closing Bell: ఉదయం నష్టాలకు బ్రేకులు వేస్తూ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో ఒత్తిడిళ్లకు లోనయ్యాయి. ఈ క్రమంలో లాభాలు ఆవిరి కావటంతో చివరికి ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ పాయింట్లు 29 నష్టపోయింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 8 పాయింట్లు లాభంతో ఫ్లాట్ ముగింపును చూసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 78 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 145 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించింది. కానీ మార్కెట్లలో ప్రధానంగా మెటల్, పవర్ రంగాల షేర్లు మంచి పనితీరును కనబరిచాయి.

ప్రధానంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నేడు వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనుంది. దీంతో భారత మార్కెట్లలోని ఇన్వెస్టర్లు ముందుగానే అప్రమత్తంగా వ్యవహించటంతో మార్కెట్లో కొంత ఒడిదొడుకులకు లోనయ్యాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే అంచనాల ప్రకారం ఈ సారి ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల మేర రేటు పెంపు ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. వీటికి తోడు కంపెనీల క్యూ1 ఫలితాలు సైతం మార్కెట్లను స్వల్పంగా ప్రభావితం చేస్తున్నాయి.
ఎన్ఎస్ఈలో హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, టైటాన్, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, గ్రాసిమ్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, టాటా కన్జూమర్, మారుతీ, సిప్లా, అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటర్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఎల్ టి, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, బీపీసీఎల్, బజాజ్ ఆటో, యూపీఎల్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, నెస్లే, ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications