వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే తాజా త్రైమాసికంలో 30.1 బిలియన్ డాలర్లు లేదా క్లాస్ ఏ షేర్‌కు 18,994 డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే సమయంలో 16.5 బిలియన్ డాలర్లు లేదా 10,119 డాలర్లు వచ్చింది. ఆపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజ కంపెనీల్లోని షేర్ల ద్వారా బెర్క్‌షైర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఆదాయం ఎక్కువగా వచ్చింది.
అయితే బెర్క్ షైర్ ఆపరేటింగ్ ఆదాయం 32 శాతం క్షీణించి 5.49 బిలియన్ డాలర్లు లేదా ఒక్కో క్లాస్ ఏ షేర్‌కు 3,452.45 డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 8.07 బిలియన్ డాలర్లు లేదా 4,943.04 డాలర్లుగా ఉంది. బెర్క్ షైర్ ఆదాయం 3 శాతం తగ్గి 63.02 బిలియన్ డాలర్లుగా నమోదయింది. బెర్క్ షైర్ హాత్‌వే లాభం 82 శాతం ఎగిసింది.

బైబ్యాకం కోసం...
కరోనా మహమ్మారి నేపథ్యంలో వారెన్ బఫెట్ రూటు మార్చారు. 2020లో తొలి 9 నెలల్లో కంపెనీ షేర్ల బైబ్యాక్‌కు ప్రాధాన్యత ఇచ్చి, 16 బిలియన్ డాలర్లను బైబ్యాక్ కోసం వెచ్చించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. 2019లో ఆక్సిడెంటల్ పెట్రోలియం కార్ప్ డీల్, ఏడాది కాలంపాటు ఐఫోన్ల దిగ్గజం ఆపిల్ ఇంక్ షేర్ల కొనుగోలుకు వెచ్చించిన నిధుల కంటే ఇవి అధికం. కరోనా నేపథ్యంలో తన పెట్టుబడి ప్రణాళికల్లో ఆయన కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లారని అంటున్నారు. రికార్డ్ బైబ్యాక్‌లు, జపనీస్ ట్రేడింగ్ సంస్థలలో వాటాలు, నేచరల్ గ్యాస్ ఆస్తుల కొనుగోలు వంటి వాటిలో పెట్టుబడులపై వెనక్కి వెళ్లారు. యూఎస్ ఎయిర్ లైన్స్ కంపెనీలో వాటాలను భారీగా విక్రయించారు.

ప్రణాళికల్లో మార్పు..
2020లో భారీగా కొనుగోళ్లు చేయాలని బఫెట్ భావించినప్పటికీ కరోనా కారణంగా ప్రణాళికలు మార్చుకున్నట్లుగా చెబుతున్నారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బైబ్యాక్స్ కోసం 9 బిలియన్ డాలర్లను వెచ్చించినట్లు బెర్క్ షైర్ హాత్ వే తెలిపింది. సొంత షేర్లను కొనుగోలు చేశారు. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లోను బైబ్యాక్ కొనసాగించనుంది. మూడో త్రైమాసికంలో నిర్వహణ లాభం 32 శాతం క్షీణించినప్పటికీ, ఇంధన విభాగం మిడ్ అమెరికన్ ఎనర్జీ ఆర్జన 21 శాతం ఎగిసింది. బైబ్యాక్స్ చేపట్టినప్పటికీ బెర్క్ షైర్ క్లాస్ ఏ షేర్ 7.6 శాతం క్షీణించింది.

కంపెనీలు.. పెట్టుబడులు
కాస్ట్‌పార్ట్స్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పైన కరోనా ప్రభావం కొనసాగుతోందని బెర్క్ షైర్ హాత్‌వే తెలిపింది. ప్రీట్యాక్స్ ఆదాయాలు 80 శాతం పడిపోయినట్లు తెలిపింది. దీనికి సంబంధించి 40 శాతం వర్క్ ఫోర్స్‌ని ఈ ఏడాది చివరి నాటికి తగ్గించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. బెర్క్ షైర్ ఆధ్వర్యంలో 90 కంపెనీలు ఉన్నాయి. ఇందులో జీకో ఇన్సురెన్స్ అండ్ యుటిలిటీ, ఫర్నీచర్, మ్యానుఫ్యాక్చరింగ్, జ్యువెల్లరీ వ్యాపారాలు ఉన్నాయి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మూడీస్, కోకాకోలా వంటి దిగ్గజ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి. సెప్టెంబర్ నాటికి 146 బిలియన్ డాలర్ల నగదు నిల్వలు నమోదయ్యాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications