కాఫీ డే బుక్స్ లో తేడాలు... ఫౌండర్ సొంత కంపెనీపైనే అనుమానం!

కేఫ్ కాఫీ డే గ్రూప్ అధినేత వీజీ సిద్దార్థ అనుమానాస్పద మృతి యావత్తు దేశాన్ని కుదిపేసింది. ఇండియా లో పారిశ్రామికవేత్తలు ఎంతటి ఒత్తిడికి లోనవుతారో చెప్పే ఒక ఉదంతంగా అది మారిపోయింది. వాస్తవిక విషయాలు ఇంకా పూర్తిస్థాయిలో బహిర్గతం కానప్పటికీ... సిద్దార్థ ఆత్మహత్యకు దారితీసిన అంశాలు మాత్రం డబ్బులకు సంబంధినవే కావటం స్పష్టం. ఒక కాఫీ సామ్రాజ్యాన్ని స్థాపించి, దానికి కార్పొరేట్ రూపు రేఖలు అద్ది ఇండియా లో ఒక వ్యవస్థీకృత కాఫీ రిటైలింగ్ ను పరిచయం చేసి అందరితో ఔరా అనిపించుకున్నారు సిద్ధార్థ. కానీ అదే సామ్రాజ్యం ఆయన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఆ ఊబిలో చిక్కుకుని ఎంతకూ బయటకు రాలేని పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని సన్నిహితులు భావిస్తున్నారు. అసలు విషయం ఎలా ఉన్నా... ఈ మొత్తం వ్యవహారంలో కాఫీ డే నియమించిన ఒక దర్యాప్తు బృందం ఇన్వెస్టిగేషన్ లో సరికొత్త నిజాలు బయటపడుతున్నాయి. దీనిపై ది ఎకనామిక్ టైమ్స్ ఒక సంచలనాత్మక కథనం ప్రచురించింది. అందులోని విషయాల సారాంశమే ఈ కథనం.

రూ 4,000 కోట్ల గల్లంతు...

రూ 4,000 కోట్ల గల్లంతు...

కాఫీ డే ఎంట్రప్రెసెస్ లిమిటెడ్ (సీడీఈఎల్) ... స్టాక్ మార్కెట్లలో లిస్ట్ ఐన సంస్థ అన్న విషయం తెలిసిందే. సిద్ధార్థ మృతి అనంతరం ఇద్దరు సభ్యులతో కూడిన ఒక దర్యాప్తు బృందాన్ని ఈ కంపెనీ నియమించింది. సీబీఐ మాజీ డీఐజీ అశోక్ కుమార్ మల్హోత్రా, అవస్థ లీగల్ కు చెందిన ఎంఆర్ వెంకటేష్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరు పూర్తిస్థాయిలో కంపెనీ లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించారు. వారి దర్యాప్తులో భాగంగా తేలిందేమిటంటే... సిద్దార్థ కు చెందిన ప్రైవేట్ కంపెనీ మైసూర్ ఆమ్లగమెటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్ (ఎంఏసీఈఎల్) కు భారీ ఎత్తున నగదు బదిలీ అయిందని. అది సుమారు రూ 4,000 కోట్లుగా ఉందని వారు తేల్చారు. ఈ నిధులను సిద్ధార్థ తెచ్చిన అప్పులను తిరిగి చెల్లించేందుకు, షేర్ల బై బ్యాక్ చేసేందుకు, పెట్టుబడుల కోసం వినియోగించేవారని తేలింది.

రూ 10,000 కోట్ల అప్పులు...

రూ 10,000 కోట్ల అప్పులు...

వీజీ సిద్ధార్థ తన వ్యాపార సామ్రాజ్యాన్ని బాగానే విస్తరించారు. సుమారు 12,000 ఎకరాల కాఫీ ఎస్టేట్ తో పాటు వేల కొద్దీ కేఫ్ కాఫీ డే చైన్ స్టోర్ల ను తెరిచారు. దాంతో పాటు రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్ విభాగాల్లోకి విస్తరించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే అగ్రశ్రేణి ఐటీ కంపెనీ మైండ్ ట్రీ లో కూడా పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడులను మంచి లాభాలకు ఎల్అండ్ టి కంపెనీకి విక్రయించి సుమారు రూ 2 వేల కోట్లు ఆర్జించారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైనట్లు భావిస్తున్నారు. ఈ మొత్తంపై చెల్లించాల్సిన పన్నుల విషయంలో సిద్ధార్థ కు వేధింపులు అధికం అయ్యాయని, వాటిని తట్టుకోలేకే తనువు చాలిస్తున్నాని సిద్ధార్థ రాసినదిగా భావిస్తున్న ఆత్యహత్య లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... కాఫీ డే చైన్లలో వచ్చే నష్టాలను భర్తీ చేస్తూ వ్యాపారాన్ని ముందుకు తీసుకు పోయేందుకు సిద్దార్థ విపరీతమైన అప్పులు చేశారని, వాటి మొత్తం విలువ సుమారు రూ 10,000 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇవన్నీ కూడా అధిక వడ్డీ రేటుకు 18% నుంచి 20% మేరకు తెచ్చినవే కావటం గమనార్హం. ఒకవైపు నష్టాలు, మరో వైపు పెరిగిపోతున్న వడ్డీల భారంతో సిద్దార్థ కుదేలయ్యారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వారికి క్లీన్ చిట్..

వారికి క్లీన్ చిట్..

ఇన్కమ్ టాక్స్ అధికారులు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాని సిద్దార్థ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. అయితే దానికి విరుద్ధంగా ప్రస్తుత దర్యాప్తులో మాత్రం అటు ఇన్కమ్ టాక్స్ అధికారులు, ఇటు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లకు క్లీన్ చిట్ లభించనున్నట్లు సమాచారం. ఇద్దరు సభ్యుల బృందం దర్యాప్తులో సిద్దార్థకు వేధింపులు జరిగిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లభించలేదని తెలిసింది. తమ దర్యాప్తు నివేదికను త్వరలోనే కంపెనీకి సంపర్పించనున్నారు. కాఫీ డే లిస్టెడ్ కంపెనీ కాబట్టి... ఆ దర్యాప్తు నివేదిక కూడా వాటాదారులకు అందుబాటులోకి రానుందని ఈటీ తన కథనంలో వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా... కాఫీ డే కు, సిద్దార్థ సొంత కంపెనీలకు మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగాయని, అన్నిటికీ సిద్దార్థ ఒక్కరే బాస్ కాబట్టి అవేమీ బయటకు పొక్కలేదని తెలుస్తోంది. కానీ, చివరకు ఎంఏసీఈఎల్ రూ 4,000 కోట్ల మేరకు కాఫీ డే కు బకాయి పడిందని సమాచారం. అయితే ఈ కంపెనీ మెజారిటీ వాటాదారు ఐన సిద్దార్థ తండ్రి గంగయ్య హెగ్డే కూడా సిద్దార్థ మృతి చెందిన నెల రోజుల్లోనే మరణించారు. దీంతో ఈ వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారిపోయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+