ప్రయివేటు ఉపాధ్యాయులపట్ల కరోనా ఊహించని పిడుగుగా మారింది. ఈ వైరస్ కారణంగా స్కూల్స్ తెరుచుకోలేక వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నెల జీతంపై నెట్టుకు వచ్చే వేలు, లక్షలాది మంది ప్రయివేటు స్కూల్ టీచర్లు, ప్రయివేటు కాలేజీల లెక్చరర్ల ఉద్యోగాలు పోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని స్కూల్స్ డిజిటల్ మోడ్‌లో తెరుచుకున్నప్పటికీ పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. స్కూల్స్ పరిమిత సంఖ్యలో ఉండటంతో పాటు టీచర్లు కూడా పరిమిత సంఖ్యలోనే వర్క్ చేస్తున్నారు.

వేతనాల్లేక.. ఉద్యోగాలు పోయి
ప్రయివేటు స్కూల్ టీచర్లు అరాకొర వేతనాలతో నెట్టుకు వస్తుంటారు. ఇప్పుడు కరోనా, లాక్ డౌన్ కారణంగా అది కూడా లేకుండా పోయింది. కొన్ని స్కూల్స్ వేతనాలు లేని సెలవుల్లో ఉంచగా, మరికొన్ని స్కూల్స్ ప్రస్తుతానికి టీచర్లను తొలగించింది. ఆ తర్వాత స్కూల్స్ ఓపెన్ అయ్యాక వెసులుబాటును బట్టి వారిని లేదా కొత్త వారిని తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి.

వీరిపై ఎక్కువ ప్రభావం
ఉదాహరణకు ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే 40 వేలమంది ప్రయివేటు టీచర్లు, లెక్చరర్లపై ప్రభావం పడింది. వీళ్లు ఉద్యోగాలు కోల్పోయారు. పలు హైస్కూల్, కాలేజీలు డిజిటల్ మోడ్‌లో పాఠాలు నిర్వహిస్తున్నాయి. వీరిపై కూడా ప్రభావం భారీగానే పడినప్పటికీ, అడ్మిషన్స్ లేని నర్సరీ, ప్రీ-ప్రైమరీ స్కూల్స్ టీచర్లు దాదాపు పూర్తిస్థాయిలో ప్రభావితమవుతున్నారు. ప్రీ-నర్సరీ స్కూల్స్‌లో ప్రభుత్వం ఆన్ లైన్ క్లాస్‌లను నిషేధించింది.

గత ఏడాది ఫీజులే రాలేదు
మనవి బడ్జెట్ స్కూల్స్ అని, వీటి ద్వారా ఏడాదికి రూ.30వేల కోట్ల నుండి రూ.40వేల కోట్లు వస్తాయని, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, లాక్ డౌన్ మార్చి చివరి వారం నుండి ప్రారంభం కావడంతో కొంతమంది పేరెంట్స్ గత ఏడాది ఫీజులు కూడా పూర్తిగా చెల్లించలేదని, కనీసం రెండు నుండి మూడు శాతం పేరెంట్స్ కూడా ఫీజు చెల్లించడం లేదని కర్ణాటక అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ (కేఏఎంఎస్) జనరల్ సెక్రటరీ చెప్పారు.

వేతనాల కోత.. రూ.1000 కోట్ల రుణం ఇవ్వాలి
బడ్జెట్ స్కూల్స్ పరిస్థితి ఇలా ఉంటే, ప్రీమియం స్కూల్స్ తమ టీచర్స్ శాలరీని 30 శాతం నుండి 50 శాతం మధ్య తగ్గించాయని, ఈ స్కూల్స్ ఇప్పటికే ఫీజులు కలెక్ట్ చేశాయని చెబుతున్నారు. టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ కోసం కొన్ని స్కూల్స్ రిజర్వ్‌గా ఉన్న కొన్ని నిధులతో ఫీజులు చెల్లించాయని, కానీ ప్రభుత్వ సహకారం లేకుండా ఎంత కాలం కొనసాగుతామని ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్స్ శాలరీస్ కోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో 54.5 లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు స్కూల్స్, 8 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్‌లో చదువుతున్నారు.

మీ భర్త టెక్కీ కాబట్టి..
కొన్ని స్కూల్స్ శాలరీ పెంపు, శాలరీ ఇవ్వడానికి సంబంధించి వారి ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయట. ఉదాహరణకు కర్ణాటకలో ఓ ప్రయివేటు స్కూల్ టీచర్ భర్త సాఫ్టువేర్ ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మీ వేతనపెంపుని నిలిపివేసుకోవాలని యాజమాన్యం కోరిందట.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications